Saturday, 10 December 2016

Songs5

[10/12 4:40 pm] VINAY KUMAR: రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)
రారే చూడ మనమేగుదామన్నయ్య (2)  ||రాజులకు||

యుదాయనే దేశమందన్నయ్య (2)
యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2)  ||రాజులకు||

తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2)    ||రాజులకు||

బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2)
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2)  ||రాజులకు||

ఆడుదాము పాడుదామన్నయ్య (2)
వేడుకతో మనమేగుదామన్నయ్య (2)      ||రాజులకు||
[10/12 4:43 pm] VINAY KUMAR: ఆరాధన స్తుతి ఆరాధన (3)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని         ||ఆరాధన||

అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని        ||ఆరాధన||

దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని        ||ఆరాధన||
[10/12 4:45 pm] VINAY KUMAR: కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పె (2)
యేసే తోడమ్మా                             ||కన్నీరేలమ్మా||

నీకేమీ లేదని ఏమీ తేలేదని
అన్నారా నిన్ను అవమాన పరిచారా
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా (2)         ||కన్నీరేలమ్మా||

నీకెవరూ లేరని ఏం చేయలేవని
అన్నారా నిన్ను నిరాశపరచారా
పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)             ||కన్నీరేలమ్మా||