Saturday, 10 December 2016

Songs4

[10/12 4:46 pm] VINAY KUMAR: క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే (2)
అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే

పరలోక దూతాలి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా (2)
అజ్ఞానము అదృష్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను (2)    || అరె గొల్లలొచ్చి ||

కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను (2)
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)      || అరె గొల్లలొచ్చి ||
[10/12 4:47 pm] VINAY KUMAR: క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు
యేసయ్య జన్మదినం వచ్చేనులే (2)
ఆనందించెదం నూతన కీర్తన పాడెదం
యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం
యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2)

కన్యక గర్భములో యేసయ్య జన్మించెను
పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను
దివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను (2)
గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి
రక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి (2)     ||క్రిస్మస్||

దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెను
తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెను
సాతాను కట్లన్ని యేసయ్య తెంచెను (2)
జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి
బహుమానములిచ్చిరి సాగిలపడి మొక్కిరి (2)     ||క్రిస్మస్||
[10/12 4:48 pm] VINAY KUMAR: కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||