Saturday, 10 December 2016

Songs3

[10/12 4:49 pm] VINAY KUMAR: తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2)         ||తార||

మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే         ||తార||

బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే        ||తార||
[10/12 4:49 pm] VINAY KUMAR: తొలకరి వాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2)
అది నూతన పరచును ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును సంతోషపరచును (2)        ||తొలకరి||

ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి జీవింపచేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2)            ||అది నూతన||

సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)
యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2)            ||అది నూతన||