[10/12 4:50 pm] VINAY KUMAR: దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు||
సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
తెరచి ఉంది తీర్పు ద్వారం
మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు||
రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసు క్రీస్తు ప్రభువు నందే
ఉంది నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||
[10/12 4:51 pm] VINAY KUMAR: ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2)
నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకే
ఆరాధన – ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే
ఆరాధన – ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
తన వాక్యముతో నను నింపిన యేసయ్యకే
ఆరాధన – ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకే
ఆరాధన – ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
[10/12 4:52 pm] VINAY KUMAR: నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2)
నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||
నాకు ఉన్న సామర్ధ్యం
నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం
నాకు ఉన్న సంతానం (2)
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2)
కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||
నాకు ఉన్న ఈ బలం
నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం
నిలువ నీడ ఈ గృహం (2)
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)
కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||