Thursday, 20 October 2016

యదార్థమైన ప్రార్థన

ఓ ప్రభువా, నా దేవా, నేను యదార్థమైన మరియు సంపూర్ణ భక్తిగల ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నతనయేలును మార్గమద్యములో కనుగొనిన రీతిగా నీవు నన్ను కనుగొందువుగాక. నా ప్రార్థనలోని కొన్ని ఉద్దేశాలు నా స్వప్రయోజనము మరియు నా స్వలాభము కొరకేనని ఒప్పుకొనుచున్నాను. నేను కొన్ని సార్లు నా హృదయాన్ని పరీక్షించుకొని, దానిని సంపూర్తిగా  మీ యెదుట ప్రార్థనలో బయలు పరచుటకు సహాయము తీసుకోలేదని ఒప్పుకొనుచున్నాను. దానికి బదులుగా, మీరు నా కొరకు చేయవలసిన వాటిని కోరుకొనుటకు మాత్రమే నేను మీ సన్నిధికి వచ్చాను. ఓ ప్రభువా, ఇప్పుడు నేను మీ యెదుట సంపూర్ణ విధేయతతో మోకరించి, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని అడుగుతున్నాను. నేను నా హృదయమును పరిశీలించుకొంటూ, పరిపూర్ణ యదార్థతతో మీ సన్నిధికి వచ్చుట ద్వారా మీరు నన్ను గూర్చి, నేను మిమ్మును గూర్చి సంపూర్తిగా తెలుసుకొని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను మిమ్మును కలుసుకొన్నప్పుడు, నాలో ఎటువంటి కల్మషము లేదని ఆయన ద్వారా నేను మరియు నా పాపాలు ఆయన ప్రాయశ్చిత రక్తములో కడుగ బడ్డాయని ఆయన నన్ను గూర్చి సాక్ష్యామిచునప్పుడు, నేను మీ యెద్దకు వచ్చుటకు సంకోచించకుండులాగున రాక్షకుడయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను........ ఆమేన్.