ఆది. 21:17 దేవుడు ఇష్మాయేలు (చిన్నవాని) మొర వినెను.
ఈ చిన్నవాడు ఇష్మాయేలు, ఇతడు చిన్న తనములో తన పెద్దమ్మ (శారా)ను పరిహరించినందున, ఇతని తల్లిని చిన్నవాడిని ఇంటిలో నుండి తరిమివేసినందున అరణ్యములో త్రాగడానికి మంచినీళ్ళులేక తల్లి బిడ్డ బాధపడిరి. చివరికి తల్లి నా కుమారుడు నా ఎదుట చనిపోతాదేమో అని ఏడ్చెను. ఈ చిన్నవాడు దేవునికి మొర పెట్టెను. ఏ విధంగా మొర పెట్టి ఉంటాడు? నా వలననే కదా ఈ తప్పు జరిగినది. నా పెద్దతల్లిని, తండ్రిని విడిచి వచ్చి అరణ్యములో ఉన్నాము. నా తల్లికి దుఃఖం కలుగజేసాను అని బాధపడుచు దేవునికి ఏడుస్తూ మొర పెట్టి ఉంటాడు. దేవుడు ఈ చిన్నవాని మొర విన్నాడు. ఆయన స్వరము దేవుడు విన్నాడు అని దూత అతని తల్లితో చెప్పి దైర్యపరచి నీళ్ళ ఊట చూపించెను. తరువాత ఈ చిన్నవానిని ఆశీర్వదించి గొప్ప జనంగా చేసెను. పిల్లవాడి ప్రార్థనకు జవాబిచ్చిన గొప్ప దేవుడు, ఏడుస్తూ మొర పెట్టిన వినిన దేవుడు అని నిరూపించుకనేను. (ఆది 21:8:21)
దాసీ పిల్లలు, పనివారి పిల్లలు, చిన్న పిల్లల ప్రార్థన దేవుడు వింటాడు. వారు ఎవరికి దాసులు? మనుష్యులకు కాదు క్రీస్తుకు దాసులు, దాసురాండ్రు వారి పిల్లలు ప్రార్థనలు కూడా ప్రభువు వింటాడు. క్రీస్తు సేవ ఎటువంటిదైనా ఆశీర్వదింపబడతారు.