అది 25 : 21 ఇస్సాకు, తన భార్యను గూర్చి ప్రార్దించగ వచ్చిన జవాబు
అబ్రహాము కుమారుడు ఇస్సాకు, రిబ్కాను పెండ్లిచేసుకొనిన తరువాత సంతానము లేదు. సంతానము కోసం ఎవరి దగ్గరకు వెళ్ళలేదు. వారి దేవుడైన యెహోవాను ఇస్సాకు వేడుకొనగా 20 సంవత్సరాల తరువాత సంతానము కల్గిరి. ఒక బిడ్డ కావాలని అడిగితే ఇద్దరు బిడ్డలను ఇచ్చెను. దేవుడు ఇచ్చిన జవాబును ఎంత కాలము ఎక్కువైతే అంత లాభము. ఎక్కువగా ఉండే జవాబు వస్తాది అనీ వీరిని చూచి అర్ధమవుతుంది. జవాబు వెంటనే రాకపోయిన పరవాలేదు గాని మంచి బహుమతి, బలమైనది, మంచి ఆశీర్వాదము కావాలని మొరపెట్టాలి. మనము అడిగిన వెంటనే దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఈయుగలడని ఋజువు అయింది. ఏశావు, యాకోబు అనువారు గొప్పసంతనముగా ఆశీర్వదించబడినవారుగా వీరి పిల్లలుగా చదువుచున్నాము. ( ఆది 25 : 19 - 26)
మీ పిల్లల చదువు 10వ తరగతి అయిన వెంటనే ఉద్యోగం కోరుతారా? కొరరు. అలా అయితే మంచి ఉద్యోగం రాదనీ. ఎంత ఆలస్యమైనా పరవాలేదు. ఎక్కువ చదవాలి, పెద్ద ఉద్యోగం కావాలి అంటారు.
పిల్లల విషయమై పెండ్లి ఐన వెంటనే సంతానం కావాలి అంటారు. ఆలస్యమైనా పరవాలేదు. మంచి సంతానం ఆశీర్వదించబడినట్లుగా కోరుకోరు. ఇక్కడ కంగారు పడతాము. ఇస్సాకునకు 20 సంవత్సరాలు సంతానం లేదు. ఆ తరువాత కలిగిన సంతానం బహుగా ఆశీర్వదించబడిన బలవంతులుగా ఉన్నారు.
Posted by Samson Mukkani