Saturday, 22 October 2016

ప్రార్థన - జవాబు - 05

ప్రార్థన - జవాబు - 05

ఆది 28:20-22 యాకోబు ప్రార్థనలో మ్రొక్కుకొనుట.
ఆది 32:10, 36:7 - ఈ ప్రార్థనకు జవాబు.

యాకోబు దేవునితో చేసుకుంటున్న ఒప్పందం ప్రార్థనా పద్ధతి. తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రము దయచేసిన యెడల నీవు ఇచ్చిన ప్రతి దానిలో పడవవంతు నీకు చెల్లించెదను అని మ్రొక్కెను. ఈ ప్రార్థన చేసుకొన్నప్పుడు అతనికి వంటిపై వస్త్రములు ఒక చేతి కర్ర తప్ప ఏమి లేవు. ఒంటరిగా వెల్లుచున్నాడు. తన మేనమామ గారి ఊరికి. ఇక్కడ నుండి 20 సం"కు ఏమి జరిగిందో చూద్దాము.
              ఆది 32:10 వచనంలో యాకోబు చెప్పినది. చేతి కర్రతో ఈ యొర్దాను దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. ఆది 36:7 వచనంలో వారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి నివసించలేని ఆస్తి, భూమి భరించలేని ఆస్తితో యాకోబును దేవుడు ఆశీర్వదించెను. మన ప్రార్థనలకు వెంటనే ఆస్తి పెరిగిపోదు, ఆయన పెట్టిన శ్రమలను తట్టుకొని , ఆయన సన్నిధిని ఎప్పుడూ మ్ప్ర పెట్టినచో ఇటువంటివి జరిగి తీరుతాయి అని దేవుడు చూపిస్తున్నాడు.
              కొత్తగా సేవ మొదలు పెడతారు, మొదలు పెట్టినప్పుడు యాకోబువలే మ్రొక్కుకుంటాము. ఈ చిన్న సంఘమును ఆశీర్వదిస్తే నేను ఈ సంఘము ద్వారా అనేక కార్యములు నీకొరకు చేస్తాను. కానీ దానికి కాలము ఎక్కువ పట్టవచ్చు. ఈ మధ్యలో శోధనలు, సమస్యలు రావచ్చు. అవి నెగ్గుతూ ప్రార్థన విడువక పోరాడితే మందిరము పట్టని ప్రజలను నీకు అప్పగిస్తాడు. యాకోబు ఒక్క కర్రతో బయలుదేరాడు, భూమి భరించలేని ఆస్తిని దేవుడు ఇచ్చాడు.

By : సాంసన్ ముక్కని