Tuesday, 25 October 2016

విసుగక ప్రార్థించుడి...

ప్రార్ధన ఎంతో శక్తివంతమైనది అనే సత్యం మనలో ఎంతమందికి తెలుసు ? మనమందరం ప్రార్ధన మీద ఉన్న నమ్మకాన్ని బాహ్యంగా ప్రకటిస్తున్నాం. కాని, మనలో ఎంత మంది ప్రార్ధనకున్న శక్తిని ఆచరణలో వ్యక్తపరుస్తున్నారు? ఎంత వరకు ప్రార్ధనను నమ్ముతున్నారు? అనేక మంది క్రైస్తవులు తరచుగా అపజయం పొందటానికి కారణం ఏమిటి? వారు విస్మరించటమే కదా. అనేక మంది సంఘ సేవకులు నిరాశ, నిస్పృహల పాలు కావటం ఎందుకు? వారు ప్రార్థించకపోవడమేగా.

                         తాము ఏంతో ప్రయత్నించి సువార్త సేవలు చేసినప్పటికినీ అతి కొద్ది మంది మాత్రమె " చీకటి నుండి వెలుగులోకి " వస్తున్నారేందుకు? కారణం వీరు ప్రార్థించకపోవడమే కదా!

మన సంఘాలు దేవుని కోసం అగ్నిలా మండటం లేదు ఎందుచేత? ఎందుకంటే మన సంఘాలలో నిజమైన ప్రార్ధన అతి తక్కువగా జరుగుతుంది.
ప్రియ చదువరి ఆ దేవాదిదేవుడు మనుష్యులకు ఆయనకు మధ్య ప్రార్ధన అనే వారధిని ఏర్పాటు చేసాడు. కేవలం ప్రార్ధన ద్వారానే మనం ఆయనతో సన్నిహిత భాంధవ్యం కలిగి ఉంటాము అని మర్చిపోవద్దు.

         ఏసుప్రభువు ఇంతకు ముందు లాగానే నేడు కూడా సర్వశక్తి మంతుడిగా ఉన్నాడు. ఇంతకుముందులాగానే జనులందరు రక్షించబడాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆయన చేయి మనల్ని రక్షించలేనంత దూరంగా ఏమి లేదు. కానీ మనము ఎక్కుగా ప్రార్థించకపోతే , మరిఎక్కువగా ప్రార్థించకపోతే ఆయన చేయి మనల్ని తాకలేదు. మన అపజయాల రహస్యం ప్రార్ధన యొక్క అవసరాన్ని మనం అర్థం చేసుకోకపోవడంలోనే ఉంది.

(మార్కు 6 : 6) లో చెప్పబడిన దానిని బట్టి అక్కడ ఉన్న ప్రజల అవిశ్వాసమే అయన ఎటువంటి అద్భుత కార్యాలను వారి నగరాలలో చేయకపోవడానికి కారణం అయ్యింది. ఆనాడు ఉన్నటువంటి అవిశ్వాస అపరాధ పూరితులయిన వారు ఆయనలో ఉన్న తేజస్సును కనుగొనలేక ఆయనను గ్రహించలేదు, విశ్వసించలేదు అనే విషయాన్ని గుర్తించాలి. ఈనాడు ఆయనను ప్రేమిస్తున్నాం , ఆరాధిస్తున్నాం అని చెప్పినప్పటికీ మనలో బహుకొద్ది మంది మాత్రమె దేవుణ్ణి ఆధారం చేసుకొని తమను తాము ప్రోత్సాహించుకుంటున్నారు.

(యోవేలు 2: 28
తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు) ఇప్పుడు ఉన్నవి అతి భయంకరమైన అనూహ్యమైన రోజులు. చెప్పాలంటే దేవుడు తన ఆత్మను విజ్ఞపన చేసే ఆత్మను మనుష్యులందరిపై కుమ్మరించె ఆఖరి దినాలు ఇవే అని ఉహించడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రైస్తవులమని చెప్పుకొనే వారిలో ఎక్కువ మంది విజ్ఞపన అంటే ఏమిటో తెలియక ఉన్నారు.

            నా ప్రియ సహోదరి, సహోదారుడా నేడు క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము, రక్షింపబడిన మనము పైకి పెదాలతో ప్రార్థించేవారిగా ఉండకుండా, స్థిరమైన విశ్వాసముతో , హృదయపూర్వకంగా, ప్రార్ధనలో ఉన్న శక్తిని అనుభవిస్తూ ఆయనతో ఒక స్థిరమైన సన్నిహిత బాంధవ్యాన్ని కలిగి ఉండాలని ఆ దేవాది దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు.

మనం ఎప్పుడైతే మోకాళ్ళ మీద నిలబడి నిజమైన ప్రార్ధన విజ్ఞపన చేస్తామో అప్పుడే అత్యున్నత స్థాయిని అందుకోగలం అని మర్చిపోవద్దు.

ప్రార్ధనాపరులుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, ఈ కడవరి దినాలలో దేవుడు మనలను అందరిని బహుగా స్థిరపరుచునని నమ్ముచున్నాను.

                 ఆయన తన పరిశుద్ధాత్మను విరివిగా మన అందరి మీద కుమ్మరించును గాక.(యూదా : 21) పరిశుద్ధాత్మలో ప్రార్థించూదాం....తండ్రి పరిశుద్ధాత్మలో ప్రార్తింప మాకు నేర్పించండి. ప్రభువు నామమున...........ఆమెన్

Author : Samson Mukkani