ఆదికాండము 20: 17
అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలుకనిరి.
అబీమెలెకు అన్నవాడు గెరారు రాజు అతఫు అబ్రహము భార్య అయిన శారా కు కీడు చేయనుద్దేశించినవాడు. దేవుడు ఈ కీడును తప్పించి, ఆ రాజు కుటుంబమును అనగా భార్యను దాసీలను గొడ్రాళ్ళుగా చేసెను. అంతే కాకుండా అబ్రాహామును హానిచేయదలచితిని, గనుక అతడు ప్రార్థిస్తే గాని నీ కుటుంబము గర్భములు తెరువను, నీవు నీ కుటుంబము చచ్చెదరు అన్నట్లు చెప్పెను. అందువలన అబ్రహాము రాజు కుటుంబము గూర్చి ప్రార్థించన తరువాత ఆ కుటుంబము బాగుపడెను. ఒక రాజు కుటుంబము గూర్చి పరదేశిఅయిన సామాన్యుడయిన అబ్రహాము ప్రార్థనకు జవాబు ఇచ్చిన గొప్ప దేవుడు అని నిరూపించుకొనేను. (అది 20 అధ్యాయము చదువవలెను) శత్రువు కొరకు ప్రార్థించిన అబ్రహాము మనసు గొప్పది. ఎలా నువ్వు చేయగలవా!
పరదేశీయులుగా మనము ఏ ప్రాంతములో ఉన్న అక్కడ ఎంత గొప్ప వారాయిన మనకు కీడు తలపెట్టగా మన దేవుడు వారితో యుద్దము చేస్తాడు. మన చేతికి వాళ్ళని అప్పగించి మన ప్రార్థన వలనే వారికి మేలు చేస్తాడు. మనల్ని వారు గుర్తించునట్లు చేస్తాడు.
By : Samson Mukkani