నిజమైన ప్రార్థన
ఓదేవ, పనుల ఒత్తిడితో విరామంలేని నా జీవితం వల్ల నేను మీతో సరియైన సహవాసంను,లోతైన సంబంధబాంధవ్యమును పెంపొందించుకొనుటకు సమయాన్ని వెచ్చించలేకపోయానని యదార్థముగా ఒప్పుకొనుచున్నాను.నా హృదయాన్ని నేను మీ యెదుట బలపరుచుట కాని, మీ హృదయాన్ని మీరు నాకొరకై తెరచి ఉంచిన విషయాన్నీ గ్రహించుటకు గాని నేను సమయాన్ని తీసుకోలేకపోయాను. చెరసాల గోడల మధ్య ఉండి మిమ్మును గూర్చి తెలుసుకొనుటలోని ప్రాముఖ్యతను గ్రహించి, పరిశుద్ధాత్ముని సహాయంతో ప్రార్థన విషయంలో ప్రావీణ్యత పొందిన వ్యక్తీ వాలే, నిజమైన ప్రార్ధనను నేర్చుకొనుటకు గాను , తగిన సమయాన్ని వెచ్చించునట్లు గాను ముందున్న దినాలలో నాకు సహాయం చేయుము. మిమ్మును గూర్చి మరియెక్కువగా తెలుసుకొనుటకు ప్రార్థించుటలో నాకు సహాయం దాయచేయుము. మీ ప్రశస్తకుమారుని సువార్త సత్యమును అంగీకరించే అవసరత కలిగియున్న వారి యెదుట మిమ్మును గూర్చి సాక్ష్యమిచ్చుటకు శక్తిని పొందునట్లు ప్రార్తించుటకు నాకు సహాయం చేయుము. మీ మహిమర్థమై ఈ మనవులను వేడుకొనుచున్నాను. ...............ఆమెన్
Samson Mukkani