హాగారు మొర యెహోవా దేవుడు విన్నాడు.
ఆదికాండము 16: 11
యెహోవా నీ మొరను వినెను.
🔹ఒక స్త్రీ మొర, దాసి మొర తన భర్తకు రెండవ భార్య అయిన హాగారు మొర, దేవుడు విన్నట్లు ఈ అధ్యాయంలో కనిపిస్తుంది.
🔹ఏమిటి ఈమె మొర? తన యజమానురాలు శారాయి ఈమెను శ్రమ పెట్టుచున్నది.అది తట్టుకోలేక పారిపోవుచున్నది. యెహోవా దూత కలసి అల పారిపోవద్దు.ని యజమానురాలి చేతికింద అనిగి యుండు మని చెప్పెను.నీ ప్రార్థన దేవుడు విన్నాడు."నీ సంతనమును విస్తరింపజేసేదను.నీవు ఒక కుమారుని కనీ అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టెడవు" ఈ విధముగా హాగారు వాగ్దానము పొంది ఆశీర్వదించబడి అనేక ముస్లిం సహోదరులకు తల్లిగా పిలవబడుతుంది.
హాగారు శ్రమలు తట్టుకొని యజమానురాలు దగ్గర ఓర్పుతో ఉండి దేవునికి మొర పెట్టుకొనినందున తన సంతానము ఆశీర్వదించబడిరి.ప్రార్థనలో ఎటువంటి వారైనా మొర పెట్టుకుంటే జావాబు ఇచ్చే దేవుడు అని అర్థమవుతుంది.(అది.16:1 - 11) యజమానులు ప్రార్థనలు వింటాడు, కాని పనివారు ప్రార్థనలు వింటాడా? స్త్రీ ప్రార్ధన వింటాడా? బానిసత్వం చేసిన వారి ప్రార్ధన వింటాడా? అని అనుమానం వద్దు. హాగారు ఐగుప్తురాలుగా కాక అబ్రహాం భార్యగా మొర పెట్టింది. మనం అన్యులుగా కాక అబ్రహాంనకు సంతానంగా విశ్వాసము ద్వారా మొర పెట్టాలి.
Posted by : Samson Mukkani