Sunday, 25 September 2016

చిక్కులు పెట్టే పాపం. ...

ఈరోజు అనేక మంది యవ్వనస్థులుకు పాపం ఒక ఆటగా మారింది. దేవునికి విరోధముగా పాపములో జీవిస్తూ తమ జీవితాన్ని చిక్కుల్లో పెట్టుకుంటున్నారు..

ఒకరోజు ఒకడు “కొండ చిలవ పిల్లను” తెచ్చి దానికి సర్కస్ నేర్పించాడు. మొదటి సారి డ్రమ్ కొట్టగానే ఆ పాము అతనిని చుట్టుకుంటుంది,మరలా రెండవసారి డ్రమ్ కొట్టగానే అది అతనిని విదిచిపెడుతుంది. అలా ఊరిలో పది మందిని చేర్చి పాముతో ఆటలాడుచూ డబ్బు సంపాదించేవాడు. ఆ పాము రోజు రోజుకు పెద్దగా అవుచుండెను.

ఒక రోజు మామూలుగా అతని డ్రమ్ సౌండ్ విని, అతని చుట్టూ జనులు గుమికూడారు. యధావిధిగా అతను డ్రమ్ కొత్తగానే ఆ కొండచిలువ అతన్ని చుట్టుకోవడం మొదలు పెట్టింది. అది చూసి జనం సంతోషంతో చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. మరి ఆ కొండ చిలువకు కోపం వచ్చిందో ఏమో కాని, అతడు మరలా రెండవసారి డ్రమ్ కొట్టినప్పుడు ఆ కొండ చిలువ అతన్ని విడిచిపెట్టడానికి బదులు గట్టిగా బిగించుకొని చుట్టుకోవడం మొదలు పెట్టింది. అతను ఊపిరి ఆడక కళ్ళు తేలేస్తుంటే అది అంత సర్కస్లో భాగం అనుకొన్నారు అక్కడి జనాలు, కాసేపటి తర్వాత అతడు క్రిందపడి చనిపోయాడు.

నేడు అనేకులు అట్లానే పాపంతో ఆటలు ఆడుతూ, పాపం కలిగించే బ్రమ చొప్పున తమ హృదయాన్ని కఠినపరచుకొంటూ, చివరికి ఆ పాపముతోనే పట్టబడుతున్నారు.

ఓ యవ్వనస్తుడా ఈ రోజు నువ్వు కూడా పాపంతో ఆటలాడుతూ, నాకు ఏమి అవ్వదులే, నన్ను ఎవరు చూడట్లేదులే, నా జీవితం చాలా సంతోషంగా వుందిలే అనుకొంటున్నావా?పాపాన్ని రేపు వదిలేస్తాను, తరువాత వదిలేస్తాను అని కాలక్షేపం చేస్తున్నావా?
అయితే జాగ్రత్త నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది,

సంఖ్యాకాండము 32:23 – “మీ పాపము మిమ్మును పట్టుకొనును.” (మీ పాప ఫలం మీకు లభించును.)

సామెతలు 5:22 -- “దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టునువాడు తన పాపపాశములవలన బంధింపబడును.”
కనుక ఆ పాపం నిన్ను పట్టుకోక ముందే, నిన్ను చిక్కుల్లో పెట్టక ముందే దానిని వదిలి పెట్టి, నీ యవన జీవితం యేసు క్రీస్తుకు సమర్పించు.

ప్రసంగి 12:1,2 -- దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము