Friday, 23 September 2016

మోక్షానికి మార్గం

పండితులు, ఋషులు, మునులు మరియు పామరులతో సహా.... ఒకే ఆశకలిగి ఉంటారు అది “మోక్షానికి ఎలా చేరటం....?” ఆ పరలోకం పొందుకునేది ఎలా....? ప్రతి ఒక్కరి మనస్సులోని వేదన ఇదే.
మోక్షం పొందుకునేందుకు కొందరు యజ్ఞములు చేస్తారు, కొందరు తపస్సు చేస్తారు, కొందరు దానధర్మాలు చేస్తారు.
అన్ని చేసినా కానీ... ఇంత వరకూ పరలోకం చేరటం ఎలా అనేది చాలా మంది మనుషులు స్పష్టంగా తెలుసుకోలేక పోయారు.

పరలోకానికి మార్గం తెలిస్తే కదా... ఎలా వేళ్ళలో తెలిసేది.
పరలోకం నుండి వచ్చిన వారు ఒక్కరేనా ఉంటేనే కదా.... మనకి కూడా దారి చూపించేది. ముందుంకు నడిపించేది.
పరలోకానికి మార్గం తెలియాక, అక్కడి నుండి వచ్చిన వారి తోడూ లేక, మనిషి ప్రయాణం సాగిస్తే చివరికి దారితేలియక కాలమంతా చికటిలోనే అటుఇటు తిరగవలసి వస్తుంది. ఇందులో సందేహం లేనేలేదు.

ప్రతి మార్గం రోమ్ కు వెళుతుంది అనే మాట ఏంత ప్రత్యేకమైనదో... అలాగే ప్రతి మార్గం పరలోకానికి "చేర్చదు" అనే మాట కూడా అంతే ప్రత్యేకమైనది.

నా ప్రియ స్నేహితులారా.... ఒక నాడు కొందరు పర్వతారోహాకులు ఒక బృందంగా ఏర్పడి “ ఆల్ఫ్ ” అనే పర్వతం ఎలాగేనా ఎక్కాలి అని నిర్ణయించకున్నారు. ఆ పర్వతం ఎలా ఉంటుంది, ఏ ప్రాంతంలో ఉంటుంది, ఎంత ఎత్తు ఉంటుంది, దాని పైభాగంలో వాతావరణం ఏలా ఉంటుంది ఇలా అన్ని విషయాలు సేకరించారు; సిద్ధపడి తమ ప్రయాణం ప్రారంభించారు.... ఒక మూడు రోజులకి వాళ్ళు ఒక అడవిని చేరారు అది దాటితే “ ఆల్ఫ్ ” పర్వతం ఉంటుంది. ఈ బృందం ఆ అడవిలో వెళ్తుండగా ఒక చోట ఆ దారి రెండుగా వేరు అయ్యింది.... ఇప్పుడు వీళ్ళు ఏ దారిలో వేళ్ళలో చూడటానికి మ్యాప్ తీసారు అందులో చూస్తే ఆ మార్గం వివరాలు లేవు. మార్గం వివరాలు సేకరించలేకపోయారు, బృందానికి ఎం చెయ్యాలో తెలియలేదు అడవి మధ్యలో ఉన్నారు. సరేన దారిని గుర్తిచలేక పోయారు. వాళ్ళు తప్పక తిరిగి వెనుకకి రావలసి వచ్చింది.
ఎంతటి వృధాప్రయాస అండి.... ఆశ కాస్త నిరాశగా మారిపోయింది.

ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే.... వాళ్ళు అన్ని తెలుసుకున్నారు కానీ... “మార్గం” యొక్క వివరాలు తెలుసుకోలేదు.
వీరికి చేరవలసిన గమ్యం తెలుసు. చేరే మార్గం తెలియలేదు.
వీరికి ఆ గమ్యం ఎలా ఉంటుందో తెలుసు. చేరే మార్గం తెలియలేదు.
వీరు గమ్యం కోరకు చాలా సిద్దపడ్డారు. కానీ వారికి వారి ప్రయత్నాన్ని సఫలపరచే, కార్యసిద్ధిని కలుగజేసే “మార్గం” తెలియలేదు.

గమనించండి.... అందరు పరలోకం వెళ్ళాలి అనుకుంటారు.... వెళ్ళే మార్గం ఎదో తెలుసుకోవటం మరచిపోతారు.

నా ప్రియ స్నేహితులారా... లోకంలో ఎందరో బాబాలు, స్వాములు, మతాధిపతులు, జ్ఞానులు అందరు కూడా పరలోకం ఏంత అందంగా ఉంటుందో, అది ఎలా ఉంటుందో చెప్పారు, అక్కడికి మనం వెళ్ళాలి అని కూడా చెప్పారు కానీ ఏ ఒక్కరు కూడా “నేనే ఆ మార్గం” అని చెప్పలేకపోయారు.... ఎందుకంటే, వారికే తెలియదు మోక్షం ఎలా వేళ్ళలో.... ఎందుకంటే, ఆ మోక్షమార్గంలో వెళ్లి వచ్చిన అనుభవం వారికే లేదు కనుక.
కానీ.... నా యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు.... “ నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును” నా ద్వారా తప్ప తండ్రివద్దకు (పరలోకం) ఎవ్వరు చేరలేరు” అని.... విని గ్రహించే వారే లేరు. పరుశుద్ధగ్రంధంలో “జ్ఞానం ఘోషిస్తుంది. వివేచన తన స్వరమును వినిపిస్తుంది” అని వ్రాయబడియుంది... ఇది విని గ్రహించే వారే లేరు....

కొందరు అనుకుంటారు... దానధర్మాలు చేయటం మోక్షానికి మార్గం అని....
* అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయములో కోర్నేలి అనే భక్తుడు కూడా మంచిగా దానధర్మాలు, ధర్మకార్యాలు చేసారు... కానీ పరలోకం వెళ్ళే మార్గం యేసుక్రీస్తు వారని పేతురు ద్వారా తెలుసుకోవలసి వచ్చింది. కోర్నేలి సువార్త విన్నారు. కానీ చాలా మంది వినరు, గ్రహించరు.

కొందరు అనుకుంటారు... భక్తి చేయటం మోక్షానికి మార్గం అని....
* యెహాను సువార్త 3వ అధ్యాయంలో ఎంతో నిష్ట గలిగినవాడు ఎంతో మందికి జ్ఞానబోధ చేసిన మతబోధకుడైన నికోదేముకు తెలియలేదు దేవుని బిడ్డగామరి పరలోకం ఎలా వేళ్ళలో. యేసుక్రీస్తు సువార్త, మరుమనస్సు, రక్షణ, నూతనత్వం గురించి తానుకూడా తెలుసుకోవలసి వచ్చింది. కానీ చాలా మంది వినరు, గ్రహించరు.

“జ్ఞానం ఘోషిస్తుంది. వివేచన తన స్వరమును వినిపిస్తుంది”

నా యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు.... “ నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును” నా ద్వారా తప్ప తండ్రివద్దకు (పరలోకం) ఎవ్వరు చేరలేరు” అని.... ( John (యోహాను సువార్త) 14:6 )

లోకంలో నేను ఏ తప్పు చేయలేదు అనే వారు ఒక్కరు అంటే ఒకరు కూడా ఉండరు, ప్రతివారి చేతులు మలినమే... ప్రతి వారి వీపుపై పాపపు మూటే.

పాపంతో పరలోకం వెళ్ళటం అసంభవం; ఇది అందరూ ఒప్పుకునే సత్యం....
రక్తం చిందించకుండా పాపము నిర్మూలనం చేయబడదు; ఇది అందరూ ఒప్పుకునే సత్యం....
పాపం శిక్షకు, నరకానికి కారణం అవుతుంది; ఇది కూడా అందరూ ఒప్పుకునే సత్యం....

మరి, నేను పాపిని నా రక్తం కలుషితమైనది, నీ పరిస్థితి అంతే, లోకంలో తప్పు చేయనివాడు లేడు కనుక అందరి దుస్థితి అంతే... ఎవ్వరు ఎవ్వరిని విడిపించలేరు, ఎవ్వరు ఎవ్వరిని విమోచించలేని పరిస్థితి. ఇక్కడే యేసుక్రీస్తువారు తన కార్యము ప్రారంభించారు.... సర్వమానవాళిని విమోచించుటకు పాపలేకుండా భూమిపై కన్యక గర్భాన నరునిగా జన్మించారు, పుట్టుకలో పరిశుద్ధత... ఎదుగుతున్నప్పుడు జీవనవిధానంలో పరిశుద్ధత... మాట, చూపు, క్రియ, అన్నిటా పరిశుద్ధత... యేసు మీద పాపనేరం మోపేవారు ఒక్కరు కూడా లేకపోయారు, దొంగ సాక్షులను ఏర్పరచుకొవలసి వచ్చింది చివరికి... అంతటి పవిత్రుడు అయన, నిష్కళంకుడు ఆయన. అలా అయన తన పరిశుద్ధమైన రక్తమును సిలువలో చిందించి తన రక్తం ద్వారా... నిన్ను, నన్ను మరియు సర్వలోకాన్ని కూడా పాపభారం నుండి విడిపించారు. తన మరణం ద్వారా స్వతహాగా మనకి రావలసిన శిక్షను తాను భరించారు. మరణించిన మూడవ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. ఒక ఊరు ఊరే చూస్తుండగా ఆకాశానికి కొనిపోబడ్డారు. యేసు పరలోకం వెళ్తున్నప్పుడు ఎం చెప్పారు అంటే... “నేనుండు స్థలమున మీరు ఉండు లాగున మరలా వచ్చి మిమ్ములను తీసుకువెళ్తాను” అని...
ఆ పరలోకం నుండి వచ్చింది యేసు ఒక్కడే.... నమ్మితే మనలను పరలోకం తీసుకెళ్లగలిగేది కూడా యేసే.
అందుకే యేసు అంటున్నారు... “ నేనే మార్గం ” అని....

నీకు పరలోకం ఎలా ఉంటుందో తెలుసు, అక్కడికి వెళ్ళే మార్గం తెలుసా....?
నీవు పరలోకం గురంచి ఎన్నో వివరాలు సేకరించావు, అక్కడికి వెళ్ళే మార్గం తెలుసా....?
ఆ మోక్ష మార్గమే “ యేసు “. ఆ మార్గనిర్ధేశకులు యేసే.
పరలోకం నుండి మన విమోచన కోసం దిగి వచ్చింది యేసు ఒక్కరే.... నమ్మితే మనలను పరలోకం తీసుకెళ్లగలిగేది కూడా యేసు ఒక్కరే.

ఇవి అన్ని సువార్తలోని ప్రాధమిక విషయాలు.... మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంటే ఈ రోజే బైబిల్ చదువటం ప్రారంభించండి. పరలోకం నిన్ను ఏంతగా ప్రేమిస్తుందో చూడగలుగుతావు.

హల్లెలూయ. . . .

మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులవారి గూర్చిన ఈ సువార్త ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్‌. ఆమేన్. ఆమేన్.
Author : Rev.Prathibha Medam