Tuesday, 30 August 2016

ఆరాధనలో పాటించాల్సిన కనీస క్రమశిక్షణ - వస్త్రధారణ

స్త్రీ పురుష వేషం వేసుకోనకూడదు. పురుషుడు స్త్రీ వేషం వేసుకోనకూడదు.ఆలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ద్వితీ 22:5.

గమనిచారా? బైబుల్ గ్రంధం క్లియర్ గా చెబుతుంది స్త్రీ పురుష వేషం వేయకూడదు పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు అనగా స్త్రీ పురుషుని వలె వస్త్రధారణ చేసుకోకూడదు. ఐతే నేటి దినాల్లో మోడరన్ కల్చర్ మన దేశంలో రాజ్యం చేస్తుంది, మన దేశ ఆచార వ్యవహారాలను మించిపోయింది మోడరన్ కల్చర్.దానివల్ల ఇప్పడు అమ్మాయిలు స్త్రీలు Jeans ప్యాంటు- టైట్ T-షర్టు వేసుకొని తిరుగుతున్నారు. ఏమంటే చాల కంఫర్ట్ గా వుందని కొందరు, లేటెస్ట్ ఫాషన్ అని కొందరు, లేటెస్ట్ ట్రెండ్ అని కొందరు, ఫలానా హీరొయిన్ వేసుకోంది కాబట్టి నేను వేసుకొంటున్నాను అంటున్నారు.

అయితే బైబుల్ దీనిని ఖండిస్తుంది. స్త్రీ పురుషునిలాగా బట్టలు వేసుకోకూడదు. మన భారత దేశ వస్త్రధారణ ప్రకారం జీన్స్ ప్యాంటు T షర్టు స్త్రీ వేషం కాదు. అది ఏ దేశ మైన అది పురుషుని వేషమే. మరి వీరు దేవుడైన యెహోవాకు అసహ్యులు కారా? దేవునికి అసహ్యులు అంటే పరలోకం చేరలేరు. పరలోకం లేదు అంటే నరకానికి సీట్ ఖాయం అన్న మాట.

సరే బయటి వారి కోసం మనకు అనవసరం. అయితే నేటి దినాల్లో చాల మంది అమ్మాయిలు పాటలు చాలా బాగా పాడుతున్నారు. worship చేస్తున్నారు. నడిపిస్తున్నారు.పరలోకాన్ని క్రిందికి దించుతున్నారు అందుకు దేవునికే మహిమ. గాని వారిలో కొందరు జీన్స్ ప్యాంటు లు T షర్టులు ,షర్టు లు వేసుకొని పాటలు పాడుతున్నారు. ఇది దీవెనా? శాపమా?

ప్రియమైన సంఘకాపరి! ఎప్పుడైనా వీరిని వారించావా? ఎవరైనా చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? వారి కానుకలు ఆశించి ఇలాంటివి భోదించడం మానేశావా?ఖండించుము గద్ధించుము భుద్ధిచెప్పుము. (2 తిమోతి 4:2)లో నీకు అధికారం ఇస్తే వారి కానుకలు ఆశించి వారికి అనుకూల భోదలు చేస్తున్నావా? అవి భోదించక పొతే వారి ఆత్మలకి వుత్తరవాదివి నీవే అని మరచి పోతున్నావా? యేహెజ్కేలు 3: 16 -21.

ప్రియమైన తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలను వాక్యపు వెలుగులో పెంచుతున్నారా లేదా? బైబుల్ ని వారికి ప్రతీ రోజు భోదిస్తున్నారా లేదా? వాళ్ళు వేసుకొంటున్న వస్త్రధారణ వాక్యానుసారమైనదా లేదా కనిపెడుతున్నారా? దేవుని బిడ్డలకు తగిన వస్త్రధారనా కాదా అని చూస్తున్నారా? లేక వారు కోరిన బట్టలు కొని పెడుతున్నారా? అవి మంచివా కావా? వాక్యానికి వ్యతిరేఖమా అని సరి చేస్తున్నారా లేదా? వాక్యానికి వ్యతిరేఖమైన ఈ వస్త్రధారణ శరీరాన్ని కప్పేది పోయి శరీరపు కొలతలు చూపించేదిగా, పురుషులకి కోర్కెలు పెంచేవిగా ఉంటున్నాయి, అలాంటివి వేసుకొని ఆరాధనకి వస్తే ఆరాధన ఎలా జరుగుతుంది. మీరు ఎలా ఒప్పుకొంటున్నారు?

ప్రియమైన సహోదరి! ఒకవేళ మీ భోదకుడు , మీ పేరంట్స్ చెప్పకపోతే ఎప్పుడైనా వాక్యాన్ని చదివావా? నీవు చేసే ప్రతీదానికి అది మంచిదైన సరే చెడ్డదైన సరే విమర్శ దినమందు లెక్క చెప్పాలని తెలియదా?

నేటి దినాల్లో అనేక మంది దైవ సేవకుల కుమార్లు కుమార్తెలు మాదిరిగా వుండటం మానేసి వారే లోకస్తుల మాదిరి విచ్ల్చల విడిగా వస్త్రధారణ చేస్తూ, లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. దైవ సేవకుల కుమార్తెలే టైట్ బట్టలు పాంట్ షర్టులు వేసుకొని సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

ప్రియమైన సహోదరి! నిజంగా ఈ వాక్యాన్ని ఇంతవరకు చదివి యుండకపొతే, నీకు ఎవరు భోదించకపొతే, ఇప్పుడైనా సరే అటువంటి వస్త్రధారణ మానేయ్. ముఖ్యంగా సంఘంలో అట్టివి కుదరనే కుదరదు. దైవ భక్తీ గలవారమని చెప్పుకొనే స్త్రీలకూ తగినట్టుగా వస్త్రధారణ చేసుకోమని ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను.



ఇక పురుషులారా! సినిమా హీరోలు చేసే చెత్త హెయిర్ స్టైల్, చెత్త బట్టలు పొట్టి బట్టలు వేసుకొని బ్రస్తుడవై పోవద్దు. జేఫన్యా 1:8 అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకొనే వారినందరినీ నేను శిక్షింతును. అని సెలవిస్తుంది, అన్య దేశస్తుల వలె వస్త్రధారణ చేసుకొనే స్త్రీని గాని పురుషున్ని గాని దేవుడు శిక్షిస్తాను అంటున్నారు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. గడ్డపు ప్రక్కలు కత్తిరించుకో కూడదు అని బైబుల్ క్లియర్ గా సెలవిస్తుంది లేవీఖాండము 19:27; అనగా ఫ్రెంచ్ కటింగ్,హిప్పీ కటింగ్ దేవునికి ఇష్టం లేదు. లోకస్తుల వలె నీవు స్టైల్ చేస్తే దేవునికి ఇస్టుడిగా వుండలేవు. యాకోబు 4:4 ఎవరైతే ఈ లోకాన్ని స్నేహం చేస్తారో వారు దేవునికి వైరం అనగా శత్రుత్వం చేస్తున్నారు. దయచేసి లోకస్తుల వలె వేషం వేసుకొని సంఘంలో పాటలు పాడకు. సంఘాన్ని నీవు కాదు క్రీస్తే ఆకర్షించనీ. సంఘంలో పాటించాల్సిన కనీస క్రమ శిక్షణ ప్రియ సహోదరి సహోదరుడా పాటించమని దైవ దీవనలు పొందమని మనవి చేస్తున్నాను. అట్టి కృప మనందరికీ కలుగును గాక!

దైవాశీస్సులు . ఆమెన్


PAVURA SWARAM MINISTRIES

హృదయ కుమ్మరింపు ప్రార్థన


నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు
విలాపవాక్యములు 2:19

-నీవు లేవాలి.
ఎక్కడ నుండి? ఆధ్యాత్మికమైన మత్తులో నుండి.

-లేచి ప్రార్ధించు.
ఎప్పుడు? రాత్రి మొదటి జామున

-అంటే ఎప్పుడు?
జాములు నాలుగు
1. రాత్రి6 నుండి 9వరకు
2. 9 నుండి 12 వరకు
3. 12 నుండి 3వరకు
4. 3 నుండి 6వరకు
అంటే? నీవు నిద్రపోకముందే ప్రార్ధించాలి.

-ఎవరి కొరకు?
నీ పసిపిల్లల కొరకు

నా పిల్లలు పసివాళ్ళు కాదని తప్పించుకోవద్దు. కాకపోవచ్చు. ఆధ్యాత్మికంగా పసివారే కావొచ్చు.

-ఎట్లా ప్రార్ధించాలి?
నీ హృదయాన్ని దేవునిసన్నిధిలో కుమ్మరించి, కన్నీటితో ప్రార్ధించు.

-ఎందుకు వారి గురించి ప్రార్ధించాలి?
ఆకలితో మూర్చిల్లి పోతున్నారు గనుక.

మాకు అంతా సమృద్ధిగా వుంది ఆకలి అంటేనే మా పిల్లలకు తెలియదు అంటావా? అవును! కాదనను. కాని, ఆధ్యాత్మికమైన ఆకలితో మూర్చిల్లిపోతున్నారు. ఆధ్యాత్మిక, నైతిక విలువలు కోల్పోయి పతనమైపోతున్నారు.

కారణం?
ఒక తల్లిగా,ఒక తండ్రిగా వారి అవసరాలు తీర్చి వారిని పెంచి పెద్ద చేయడమే మా భాద్యత అనుకుంటున్నాము.దానిని ఎట్టి పరిస్థితులలోనూ కాదనను.
దానికంటే ముఖ్యమైన భాద్యత దేవుడు ఇచ్చిన పిల్లలను దేవుని కోసం పెంచాలి.అది చేయలేకపొతున్నాము.

ఎందుకు పిల్లలు ఆధ్యాత్మికముగా మూర్ఛిల్లి పోతున్నారు ? సూటిగా చెప్పాలి అంటే " ప్రార్థించే తల్లిదండ్రులు కరువయ్యారు"

ఒక్కనిమిషం !!!
నీబిడ్డల కోసం దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించిన అనుభవం నీకుందా?
ఉంటే? నీబిడ్డలు ధన్యులు.
ఒకవేళ లేకపోతే, వారు దారితప్పారు అంటే? దానికి కారణం వారుకాదు. నీవే.

ప్రార్థించే తల్లిదండ్రులు కలిగిన బిడ్డలు ధన్యులు. ( ధన్యులు అంటే ఆశీర్వాదించబడినవారు ).

1.ఇంగ్లండు దేశానికి చెందిన సూసన్న వెస్లీ తన తొమ్మిదిమంది పిల్లలను రాత్రి పండుకోబెట్టి ఒక్కొక్కరి దగ్గర ప్రార్థించడం మొదలుపెడితే, కొన్ని సందర్భాల్లో చివరివాడికి ప్రార్థించి 'ఆమెన్' అనేసరికి తెల్లవారి పోయేదట. ఆతల్లి ప్రార్థన ఫలితంగా, తన పిల్లలలో "జాన్ వెస్లి" ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవుని సేవకుడయ్యాడు. "చార్లెస్ వెస్లీ" ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడయ్యాడు. అట్లా తన పిల్లలందరూ దేవుని కోసం జీవించారు.

2. సెయింట్ ఆగస్టీన్ అనే దైవజనుడు ఈరీతిగా చెబుతున్నాడు " నా తల్లియొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యానికిి కొట్టుకొని వచ్చాను "

అయితే? మనగురించి మనబిడ్డలిచ్చే సాక్ష్యం ఏమిటి ?
కనీసం ఈరోజు అయినా మొదలు పెడదామా? నాకు ప్రార్థించడానికి ప్రత్యేకమైన గది లేదని చెప్పకు. అవసరం లేదు నీహృదయంలో ఆయనకు గది (స్థలం) వుంటేచాలు.

నీవు నిద్రపోక ముందే నీ బిడ్డలకోసం ప్రార్ధించాలి. ఆతర్వాత,
సూర్యునికంటే ముందుగాలేచి నీ బిడ్డలకోసం "ప్రార్థనాకంచెను " వెయ్యాలి. ఆరోజు ఆకంచెనుదాటి సాతాను నీపిల్లల జోలికిరాలేడు.

సాతాను మన ఇంట్లో
ప్రవేశించాక, తీరికగా ప్రార్థన కంచెను వేస్తున్నాము .ఇక వాడు ఆ కంచెలోపలే తిరిగుతున్నాడు. మనకు, మన కుటుంబాలకు సమాధానం లేకుండా చేస్తున్నాడు. మనం కంచెవేయాల్సింది వాడు ప్రవేశించక ముందు.

నీ అలారం నిన్ను లేపడంకాదు. నీ ప్రార్థన సమయం నీకు అలవాటుగా మారాలి. భారము కలిగిన తీర్మానంతో ఒక వారం ప్రయత్నించి చూడు. అది అలవాటుగా మారుతుంది. నీ అలవాటు నీ కుటుంబానికి శాంతి,సమాధానం, సమృద్ధినిస్తుంది.

ఒక తండ్రిగా యోబుకూడా తన పిల్లలు తప్పు చేసారనికాదు. ఒకవేళ తప్పుచేసి వుంటారేమోనని? నిత్యము బలులను అర్పిస్తూ వుండేవాడు. తండ్రిగా నీవు కూడా నీ బిడ్డలకోసం వేకువజామున 'ప్రార్థనా బలిపీఠం' కట్టాలి.

ప్రయత్నించి చూడు. ఇక నీబిడ్డలు ఎన్నటికీ మూర్ఛిల్లి పోరు. నిజమైనతల్లిగా, తండ్రిగా దేవుడు మనకిచ్చిన భాద్యతలు నెరవేర్చిన వారమవుతాము. ఆయన ఇచ్చే గొప్ప బహుమానానికి అర్హులమవుతాము.

ఆ రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొని ప్రార్ధిద్దాం!

అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్.....
PAVURA SWARAM MINISTRIES

విశ్వాసమే నీ విజయం

విశ్వాసంలో మాదిరి
నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12
జార్జ్ ముల్లర్ గారి అనాధ ఆశ్రమంలో ఒకరోజు వంటవాడు ఈరాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమి లేదని చెప్పాడు. సరే అని చెప్పి ప్రార్ధించడం ప్రారంభించారు ముల్లర్ గారు. రాత్రి 7 గంటలు అయ్యింది. వార్డెన్ వచ్చాడు. అయ్యగారు ఏమి చెయ్యమంటారు? పిల్లలను ప్లేట్స్ పట్టుకొని డైనింగ్ హాల్ లో కూర్చోమని చెప్పండి. ముల్లర్ గారి మాటలకు వంటవాడు, వార్డెన్ ఆశ్చర్యపోయారు ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అనుకొని, ఆయన చెప్పినట్లే చేసారు. ఈలోపు ఒక పెద్ద లారి ఆశ్రమంలోనికి ప్రవేశించింది. వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. అయ్యగారు ఈ రోజు పట్టణంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చెయ్యబడింది. హటాత్తుగా పిలువబడిన ముఖ్య అతిధులలో ఒకరు చనిపోయారు. మీటింగ్ రద్దు చేసారు.సిద్ధ పరచిన ఆహార పదార్ధాలు మీ ఆశ్రమానికి అందజేయమన్నారు. ఆహార పదార్ధాలు లారీ నుండి దించుతూ వుండగానే, వెలుపల పాలు తీసుకెళ్తున్న లారి పంచర్ అయ్యింది. ఆ లారీ డ్రైవర్ ఆ విషయాన్ని వాళ్ళ బాస్ కి చెప్తున్నాడు. అవతల నుండి వాళ్ళ బాస్ 'నీవెక్కడున్నావ్?' ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర. అయితే, ఆ మిల్క్ ప్యాకెట్స్ ఆశ్రమలో ఇచ్చేసి, లారి ప్రక్కన పెట్టు. ఆప్యాకెట్స్ 15 రోజుల వరకు పిల్లలకు సరిపోయాయట
విశ్వాసం అంటే? పరిస్థితులు ఎట్లావున్నా సరే, దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చ గలడని ఆయనపైనే పూర్తిగా ఆధారపడ గలగడం.
విశ్వాసము అంటే? నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు. హెబ్రీ 11:1
నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4:18 అప్పటికే అబ్రాహాముకు నూరేళ్ళు, శారమ్మకు తొంబై ఏళ్ళు.వారి శరీరం మృతతుల్య మయ్యింది. ఇక బిడ్డలకోసం నిరిక్షించడానికి వారికున్న ఆధారమేదీలేదు. అయితే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచ లేదు.
విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను. హెబ్రీ 11:7
నోవాహు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక్క వర్షపు చినుకుపడడం చూడలేదు. అయితే, దేవుడు అంటున్నాడు. ఏకరీతిగా నలభై రాత్రులు, పగళ్ళు ఆకాశం నుండివర్షం కురుస్తుందని. కాని, నోవాహు అదెట్లా సాధ్యమని దేవుని ప్రశ్నించలేదు. విశ్వసించాడు. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు.
విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను. హెబ్రీ 11:31 అంతే కాదు యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది.
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను. హెబ్రీ 11:24-26 ప్రతిఫలం కనానులో అడుగు పెట్టలేకపోయినా, పరమ కనానులో మాత్రం అడుగు పెట్టగలిగాడు.
కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను. సంఖ్యా 13:30 అందుకే 30 లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరగా కనానుచేరి వాగ్ధాన భూమిని స్వతంత్రించుకున్న ఇద్దరిలో కాలేబు ఒకడు. మిగిలినవాడు యెహోషువా.
మేము సేవించుచున్న దేవుడుreference మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు దానియేలు 3:17 ఆ విశ్వాసమే షడ్రకు, మేషకు, అబెద్నేగోలు అనువారికి అగ్నిగుండంను ఆహ్లాదకరంగా మార్చింది.
వీళ్ళెవరూ సమస్యను చూచి భయపడినవారు కాదు, ఆ సమస్యను పరిష్కరించగల దేవునిపైన విశ్వాసముంచిన వారు.
ఇట్లాంటి విశ్వాస వీరులను ఆదర్శముగా తీసుకొని, మనము కూడా విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్

PAVURA SWARAM MINISTRIES

లవ్ & ట్రూ లవ్ ...... (ప్రేమలో మాదిరి)

నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12
'ప్రేమ' ప్రపంచ భాషల్లో అత్యంత శక్తివంత మైన పదం. నేటికినీ మనిషి ప్రేమను నిర్వచించడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. దాని అర్ధమేమిటో తెలియకున్నా అది చేసేపనులు లెక్కలేనన్ని.
లోకం దృష్టిలో ప్రేమంటే? మూడవ తరగతి చదివే అబ్బాయి, అదే తరగతి చదివే అమ్మాయికి ' l LOVE U' అని వ్రాసి ఆ అమ్మాయి బుక్ లో పెట్టేసాడు. అంటే? ప్రైమరీ నుండే ప్రారంభ మయిపోయింది ప్రేమ.
ఒక టీనేజర్ ప్రేమంటూ తిరిగీ, తిరిగీ, పరీక్షల ఫలితాలు వచ్చాక తెలిసింది ప్రేమంటే ఏమిటో? Loss Of Valuable Education అని. మరొకడేమో రాత్రంతా చాటింగ్. నిద్రలేక నీరసం వచ్చాక వాడికి అర్ధమయ్యింది ప్రేమంటే? Loss Of Valuable Energy.అని
ఒక అబ్బాయికి ఒక అనుమానం. నా గర్ల్ ఫ్రెండ్ నా పేరును తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకుందో అని. మొత్తానికి తెలుసుకున్నాడు. ' 'టైం పాస్ 20' అని. అంటే? వీడి క్రింద ఇంకో 19 మంది. వీడిపైన ఎంత మందో? ఇప్పుడు వీడికి అర్ధమయ్యింది ప్రేమంటే? 'టైం పాస్' అని.
ఒకడేమో రక్తంతో వ్రాసేస్తాడు ( అది కోడి రక్తమో? వాడి రక్తమో? వేరే సంగతి) ఒకడేమో కత్తితో పొడిచి, మరొకడేమో యాసిడ్ పోసి చంపేస్తాడు. ఏమిటిది? అని అడిగితే నాకు దక్కనిది ఇంకెవ్వరకూ దక్కకూడదు. ప్రేమంటే ఇదే అంటాడు.
'ప్రేమికుల రోజు' (వాలెంటైన్స్ డే) ఇదొకటి.ఆ రోజు 'నా హృదయంలో నీకుతప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు' అంటూ వ్రాసి 'అందరికీ' పంచుతాడు. అదేంటి అంటే? ప్రేమ అంటే అంతే అంటాడు.
ఇక తల్లి ప్రేమ! ఆ ప్రేమను వర్ణించడం ఎవ్వరి తరమూకాదు. కాని వారి అక్రమమైన జీవితాలను కొనసాగించడానికి కన్న బిడ్డలను సహితం కర్కషంగా చంపేసే తల్లులెందరో? ఆ తల్లి ప్రేమకూడా కలుషితమవుతుంది.
ఇక అందరికీ తల్లి 'మదర్ థెరీసా' ఆమె ప్రేమ స్వచ్చమైనది. ఎవ్వరూ కాదనలేనిది. కాని, పరిపూర్ణమైనది కాదు. ఆ ప్రేమ కొందరికే పరిమితం, కొంత కాలమే పరిమితం. శారీరికమైన స్వస్థత చేకూర్చ గలిగిందిగాని, పాప రోగం నుండి మనిషిని విడిపించ లేకపోయింది.
ఇంతకీ, నిజమైన ప్రేమ అంటే ఏమిటి?
ఈ లోకంలో 'నిజమైన ప్రేమకు' అర్ధాన్ని, నిర్వచనాన్ని చెప్పిన వాడు ఒకే ఒక్కడు.
ప్రేమకు అర్ధం, నిర్వచనం? నిజమైన ప్రేమకు అర్ధం, నిర్వచనం 'నీ ప్రియ రక్షకుడే'. ఆయన ప్రేమాస్వరూపి ( ఆయనే ప్రేమయై వున్నాడు) 1 యోహాను 4:8,16
ఆయన ప్రేమతత్వం: శత్రువులను కూడా ప్రేమించు. (మత్తయి 5:44) మాటలకే పరిమితం కాదు. చేసి చూపించారు కూడా. మనము శత్రువులమై వున్నప్పుడు మన కోసం తన ప్రాణమును పెట్టారు. (రోమా 5:10)
ఆ ప్రేమ యొక్క లక్షణాలు: ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.ప్రేమ శాశ్వతకాలముండును. 1 కొరింది 13:4-8
నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటో నాకు తెలియదుగాని, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తావని. కనీసం తలిదండ్రుల ప్రేమలో కూడా అంతర్గతంగా ఒక ఆశ వుంటుంది. పిల్లలు పెద్దవారై వారిని కూడా ప్రేమగా చూస్తారని.
కాని, ఆయన ప్రేమ బదులాశించనిది. అది అమరం, అతిమధురం,అపురూపం. అవధులులేనిది అద్వితీయమైనది. సింహాసనము నుండి సిలువకు దిగివచ్చినది. మరణము కంటే బలీయమైనది. సజీవ మైనది, శాశ్వతమైనది.
అట్టి ప్రేమను అనుభవిస్తున్న నీవు ఆ ప్రేమకు మాదిరిగా జీవించాలి.
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్
PAVURA SWARAM MINISTRIES

నీవు కలవరము లో ఉన్నావా?

నీవు ఆకలిగొనియున్నావా? శరీరానుసారమైనది ఆకలి కాదు. అ౦తకంటే నీ జీవితంలో ఎక్కువగా దేనికొరకైనా ఆకలి గొనియున్నావా? నీ అంతరంగంలో తృప్తిపరచబడనిది ఏదైనా వున్నదా? అలాగైతే యేసే మార్గము. యేసు చెప్పెను “జీవాహారమును నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, మరియు నా యందు విశ్వాసముంచువాడు దప్పిక గొనడు” (యోహాను 6:35)
నీవు కలవరము లో ఉన్నావా? నీ జీవితములో ఎన్నడూ ఒక ఉద్దేశ్యమును కనుగొన లేని స్థితిలో ఉన్నావా? ఎవరో లైటు ఆర్పివేయగా నీవు స్విచ్ కనుక్కోలేనట్లు వున్నదా? అలాగైతే, యేసే మార్గము: నేను లోకమునకు వెలుగును, నన్ను అనుసరి౦చు వీడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండును అని యేసు ప్రకటించెను (యోహాను 8:12)
నీ జీవితంలో నీవు బంధింపబడినావని ఎప్పుడైనా అనిపించినదా? శూన్యము, అర్థ రహితమైన వాటినే కనుగొనుటకు, చాలా ద్వారములు తెరువ ప్రయత్నించావా ? సంపూర్తి చేయబడిన జీవితములో ప్రవేశించుటకు చూస్తున్నావా? అలాగయినచో యేసే మార్గము: “నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశి౦చిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు, బయటకి వచ్చుచు మేత మేయుచుండును (యోహా 10:19)
ఇతరులు నిన్ను ఎప్పుడూ చిన్న చూపు చూస్తున్నారా! నీ సంబంధ బా౦ధవ్యాలు శూన్యముగాను ఖాళీగానున్నవా? ప్రతివారు నిన్నుబట్టి లాభ౦ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుందా! అయినచో యేసే మార్గము. “నేను గొర్రెలకు కాపరిని; మంచి కాపరి గొర్రెలను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును” అని యేసు చెప్పెను (యోహా: 10:11, 14)
ఈ జీవితం తరువాత ఏమగునోనని ఆశ్చర్యపోతున్నావా? పనికి రాని, తుప్పుపట్టిన జీవితం విషమై విసిగి పోయావా! అసలు ఈ జీవితమునకు ఏదైనా అర్ధముందా? అని సందేహపడినావా? నీవు చనిపోయిన తరువాత కూడా జీవించాలనుకుంటున్నావా? అలా అయితే యేసే మార్గము; పునరుద్ధానమును, జీవమును నేనే; నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిననూ బ్రతుకును; బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎప్పటికినీ మరణి౦చడు. (యోహా 11:25,26)
ఏది మార్గము, ఏది సత్యము, ఏది జీవము “నేనే మార్గమును సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” అని యేసు చెప్పెను (యోహా 14.6). నీవు ఆకలి గొనుచున్నది, ఆత్మ సంబంధమైన ఆకలి. యేసు చేత మాత్రమే తీర్చ బడగలదు. యేసు మాత్రమే చీకటిని తొలగి౦చ గలడు. తృప్తి పరచే జీవితమునకు యేసు మాత్రమే ద్వారము. నీవు ఎదురు చూచే స్నేహితుడు, కాపరి యేసే! యేసే జీవము- ఈ లోకమునకు, రాబోవు లోకమునకు రక్షణ మార్గము యేసే!
నీవు ఆకలిగొని యుండుటకు కారణము, నీవు చీకటిలో తప్పి పోయిన కారణము, నీ జీవితములో అర్థము గ్రహించలేకపోవుటకు కారణము- నీవు దేవుని నుండి వేరు చేయబడుటయే! మనమందరము పాపము చేసినందున దేవుని నుండి వేరు చేయబడ్డామని బైబిలే సెలవిస్తున్నది (ప్రసంగ౦ 7 20, రోమా 3 23). నీ హృదయమందు శూన్యము కనిపించుటకు గల కారణము నీ జీవితంలో దేవుడు లేనందువల్లనే. దేవునితో సంబంధము కల్గి యుండుటకు మనము సృష్టి౦చబడినాము. మన పాపము వల్ల ఆ సంబంధము నుండి మనము వేరు పర్చబడినాము. ఇ౦కా ఘోరమైనదేమంటే మన పాపము మనలను దేవుని నుండి ఈ జీవితములోనికి రాబోవు జీవితము నుండి నిత్యము వేరుచేస్తూ ఉ౦డడమే! (రోమా 6 23, యోహా 3:36)
ఈ సమస్య ఎలా పరిష్కరింపబడగలదు. యేసే మార్గము! యేసు మనపాపములను తనపైన వేసుకొనెను (2 కొరి 5 :21) మనము పొందవలసిన శిక్షను ఆయన తీసుకుని, మన స్థానములో యేసు చనిపోయెను. (రోమా 5:8). మూడు దినముల తరువాత యేసు మరణము నుండి లేచి, పాపము మీద, మరణము మీద ఆయన జయమును రుజువు చేసెను (రోమా 6: 45) ఎందుకు ఆయన అది చేసెను. “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు” అని ఆ ప్రశ్నకు యేసే సమాధానము చెప్పెను. ( యోహాను 15: 13) మనము జీవించునట్లుగా యేసు చనిపోయెను. మన విశ్వాసమును యేసు నందు ఉంచినట్లైతే, ఆయన మరణము మన పాపములకు పరిహారముగా చెల్లించాడని నమ్మినట్లైతే- మన పాపములన్నియు క్షమించబడి, కడిగిగివేయబడినట్లే. అప్పుడు మన ఆత్మీయ ఆకలి తీర్చబడును. తిరిగి, వెలుగు వచ్చును. సంపూర్తిచేయబడిన జీవితములోనికి మనకు మార్గముండును. మన మంచి కాపరిని, నిజస్నేహితుని కనుగొనగలము. మనము మరణించిన తరువాత జీవముందని గ్రహించగలము- పునరుద్ధాన జీవితము, పరలోకమందు యేసులో నిత్య జీవము.
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను”(యోహాను 3:16)
PAVURA SWARAM MINISTRIES

Sunday, 28 August 2016

Testimonial 1

PAVURA SWARAM MINISTRIES

Saturday, 27 August 2016

Welcome to Pavura Swaram Ministries

PAVURA SWARAM MINISTRIES heartly welcomes to You and Your Family members into glory of God.

Thank you
God bless You
PAVURA SWARAM MINISTRIES

Friday, 26 August 2016

నీ నడత నిన్నెక్కడికి నడిపిస్తుంది? ...... ప్రవర్తనలో మాదిరి

నీ నడత నిన్నెక్కడికి నడిపిస్తుంది? ...... ప్రవర్తనలో మాదిరి

నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12
ప్రవర్తన అంటే? చూపులు, తలంపులు,మాటలు, క్రియలు అన్నింటి సమూహమే ప్రవర్తన.
చూపులలో పరిశుద్ధతను కోల్పోతే? తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాము. తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే? మాటలలోనూ, క్రియలలోనూ పరిశుద్ధతను కోల్పోతాము. తద్వారా మన ప్రవర్తన మలినమై, పాపమునకు మరింత దగ్గరై, దేవునికి దూరమై పోతాము.
తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు చచ్చును. సామెతలు 19:16
ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే? శారీరికముగా బ్రతికియున్నా, ఆత్మీయముగా చచ్చినవారమే. సందేహం లేనేలేదు. దీనికి ప్రత్యక్ష సాక్షి, రాజైన దావీదే. చూపులలో, తలంపులలో, క్రియలలో పరిశుద్ధతను కోల్పోయి వ్యభిచారుల, నరహంతకుల జాబితాలో చేరిపోయాడు.
దేవుని చేత "నా హృదయానుసారుడు" అని సాక్ష్యము పొందినవాడు. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా వుండడం వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది?
  • పుట్టిన బిడ్డ చనిపోయాడు. •పిల్లలు వ్యభిచారులు, హంతకులయ్యారు. •కన్నకొడుకే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు. •కనీసం చెప్పులు లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవలసి వచ్చింది. •కుక్క వంటి "షిమి " ఓ దుర్మార్గుడా, నరహంతకుడా! ఛీ! ఫో ...అంటూ దూషిస్తూ, శపిస్తూ వుంటే, మౌనముగా తల వంచాల్సి వచ్చింది. •దేవుని పక్షంగా యుద్దాలు చెయ్యడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్దాలు చెయ్యొద్దని ప్రమాణం చేయించారు. ఇట్లా... ఎన్నో! ఎన్నెన్నో!
నీ సంగతేమిటి? ఇంటర్ నెట్ లో చూడకూడనివి చూస్తూ, చూపులలో పరిశుద్ధతను కోల్పోయి, తద్వారా హృదయ తలంపులను పాడుచేసుకొని, పాపం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నావా? అయితే ఒక్క విషయం!! 'హృదయానుసారుడే' తప్పించుకోలేక పోయాడు. ఇక నీకెట్లా సాధ్యం?
నీ ప్రవర్తన సరిచేయబడాలి అంటే? ఒక్కటే మార్గం. వాక్యమైయున్న దేవునిని నీ హృదయంలో వుంచుకొని, నీ ప్రతీ కదలికలోనూ ఆయనను ముందు పెట్టుకోవాలి.
యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? కీర్తనలు 119:9
అవును! యౌవనుడైన యోసేపును పాపం పట్టుకోవాలని, బంధించాలని ప్రయత్నం చేస్తుంటే? దానికి చిక్కకుండా పారిపోతున్నాడు. ఇంటిలో పాపముందని, యోసేపు ఇంటి బయట ఉంటున్నాడు. అందుకే గదా! బానిసగా బ్రతకాల్సిన వాడు రాజుతో సమానుడయ్యాడు. దేశ ప్రధాని అయ్యాడు.
నీ జీవితం ఎట్లా వుంది? పాపమును పట్టుకోవడానికి దాని వెంటబడి పరుగులు తీస్తున్నావా? దాని చేతిలో బంధీగా మారిపోయావా? అందుకే గదా! రాజులుగా బ్రతకాల్సిన మనము ఇంకా సాతానుకు బానిసలుగానే జీవిస్తున్నాము?
నీ దుష్ట ప్రవర్తన నీకు బాధను తీసుకొస్తుంది. 'బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు.' కీర్తనలు 107:17
నీ మూర్ఖ ప్రవర్తన నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. 'మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.' సామెతలు 28:18
అట్లా కాకుండా! నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి 1 కొరింది 15:34
నీ యథార్థమైన ప్రవర్తన దేవుని ఇంటిలో నీకు ఆతిధ్యాన్నిస్తుంది.
యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కీర్తనలు 15:1,2
నీ ప్రవర్తన దేవునికి యిష్టమైనదైతే? ఆయన నీ శత్రువులనుసహా నీకు మిత్రులుగా చేస్తాడు. సామెతలు 16:7
నీ ప్రవర్తన దేవుని అధికారానికి తలవంచేదిగా వుంటే? 'ఆయన నీ త్రోవలను సరాళము చేస్తాడు. సామెతలు 3:6
ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం ఎటువైపు సాగిపోతుందో? దేవుని పిల్లలముగా మన ప్రవర్తన మనలను తృణీకరింపచేసేదిగా ఉందా?
లోకము నుండి ప్రత్యేక పరచబడిన మనమూ, మన ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్

Thursday, 25 August 2016

బైబిలు గురించిన విషయాలు/About Bible

              జాన్ గుటెన్ బర్గ్ ముద్రించిన బైబిల్


ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, యూదులు చదివే పవిత్ర గ్రంథం బైబిలు. దీనిని పరిశుద్ధ గ్రంథమని కూడా అందురు. బైబిల్ అనగా గ్రీకు భాషలో వైదిక గ్రంథాల సంహిత. బైబిలు గ్రంథము వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 ప్రవక్తలు 1400 సంవత్సరాల పాటూ వ్రాయబడినది. బైబిల్ లో మూడు రకములు ఉన్నవి - హెబ్రియ బైబిలు, గ్రీకు బైబిలు, క్రిస్టియన్ బైబిలు.
హెబ్రియ బైబిలు (Tanak):
హెబ్రియ బైబిలులో 24 పుస్తకాలు తోరా (ధర్మ శాస్త్రం), నివిం (ప్రవక్తలు), మరియు కెటువిం (రచనలు) అను 3 భాగాలుగా విభజింపబడినవి. హెబ్రియ బైబిలును యూదులు (Jews) చదువుతారు. ఈ బైబిలులో దేవుడి పేరు యెహోవా, తండ్రిగా పేర్కొనబడటం జరిగినది. హెబ్రియ బైబిలు యూదుల మతం (Judaism) యొక్క పవిత్ర గ్రంథం.
హెబ్రియ బైబిలు ఆర్యుల వేద కాలానికి చెందినది, అనగా సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల్లో వ్రాయబడినది. గ్రాంధిక హీబ్రూ (Old Hebrew) భాషలో వ్రాయబడిన పాత నిబంధనలో యూదుల ఆచారాలు, యూదులకు తమ దేవుడైన యెహోవా చెప్పిన నియమ నిబంధనలు ఉంటాయి. హెబ్రియ బైబిలులో మొదటి 5 అధ్యాయాలు మోషే (Moses) ప్రవక్తచే వ్రాయబడినవి. మొదటి మానవులైన అదాము (Adam) అవ్వ (Eve) ల జీవితం, నోవాహు (Noah) అను దైవ భక్తుడి కాలంలో జల ప్రళయం (Great Flood), దేవుడి శక్తితో మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి దారి ఏర్పరచడం, దేవుడి పది ఆజ్ఞలు మొదలైనవి పాత నిబంధనకు చెందినవి. వేదాల వలే ఇందులో కూడా జంతు బలులు పేర్కొనబడ్డాయి.
గ్రీకు బైబిలు (Septuagint):
4 వ శతాబ్దంలో టొలెమీ II (Ptolemy II) ఆజ్ఞ ప్రకారం యూదుల కులానికి చెందిన కొంతమంది రచయితలు తమ హెబ్రియ బైబిల్ ను గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఈ బైబిల్ లో హెబ్రీయ బైబిల్ లో లేని పుస్తకాలు కూడా ఉన్నాయి. తొబితు, జుడితు, సలోమాను జ్ఞానము, సిరాచు కుమారుడైన యేసు జ్ఞానము, బరూచు, యిర్మియా పత్రిక, అజారియా ప్రార్థన, ముగ్గురు చిన్నారుల పాట, సుసన్నా, బెల్ మరియు డ్రాగన్, ఎస్తేరు, 1 మక్కాబీయులు, 2 మక్కాబీయులు, 3 మక్కాబీయులు, 4 మక్కాబీయులు, 1 ఎస్ద్రాసు, ఒదెసు, మనాషె ప్రార్థన, సలోమాను కీర్తనలు, 151 వ కీర్తన అధనంగా ఉన్నాయి. ఇవి హెబ్రియ బైబిల్ లో లేవు. ఈ బైబిల్ లో చాలా పుస్తకాలను రోమన్ కేథలిక్కులు, సనాతన తూర్పు సంఘం వారు అంగీకరిస్తారు.
క్రైస్తవ బైబిలు (Christian Bible):
క్రైస్తవ బైబిలును క్రైస్తవులు, అనగా ఏసుక్రీస్తును అరాధించేవారు మాత్రమే చదువుతారు. క్రైస్తవ బైబిలులో మొదటి భాగం హెబ్రియ బైబిలు. దీన్ని క్రైస్తవులు పాత నిబంధన అని కూడా అందురు. హెబ్రియ బైబిలుకు చెందిన 24 పుస్తకాలు క్రైస్తవ బైబిలులో 39 పుస్తకాలుగా విభజింపబడినవి. దీనిని బట్టి యూదుల మతం క్రైస్తవ మతంలో ఒక భాగమని చెప్పవచ్చు. పాత నిబంధనకు చెందిన యయెషయా గ్రంథం 7:14 లో క్రీస్తు రాక గురించి ముందే ప్రసావించడం విశేషం.
ఇక రెండవ భాగమైన క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు - 4 వైదిక సువార్తలు, అపోస్తలుల కార్యాలు, 21 పత్రికలు, ప్రకటన గ్రంథము ఉంటాయి. క్రొత్త నిబంధన సుమారు 34 A.D లో ఏసు క్రీస్తు నిర్యాణం చెందిన కొద్ది కాలం తర్వాత గ్రీకు భాషలో వ్రాయబడినది. ఇందులో యూదుడైన ఏసుక్రీస్తు వంశావళి, బాల్యం, మహిమలు, శిలువయాగం, తిరిగి లేవడం, సువార్త ప్రకటన వంటివి ఉంటాయి.
ఇతర విషయాలు
బైబిలు గ్రంధంలో ఏ భాగమూ లిఖితం కాక మునుపు వృత్తాంతాలను ప్రజలు కధలుగా చెప్పుకొనేవారు. యూదుల లేఖనాల్లో చాలా భాగాలు ఈ వృత్తాంతాలే. పశ్చిమాసియా ప్రజలు లిపిని వాడుక చేసుకున్న అనంతరం (1800 B.C) వారు వృత్తాంతాలను, ప్రవచనాలను లిఖించడం ఆరంభించారు. పాత నిబంధన యూదులకు ధర్మశాస్త్రము(రాజ్యాంగము)గా వ్యవహరించబడినది. యేసు క్రీస్తు కాలంలో అది సవరణలు చేయబడి క్రొత్త నిబంధనగా చేయబడింది.
పాత నిబంధన భాగం హెబ్రీయ భాషలో వ్రాయబడగా, క్రొత్త నిబంధన భాగం క్రీస్తు శకంలో గ్రీకు భాషలో వ్రాయబడినది. బైబిలులోని ప్రతి వాక్యానికి అదే అధ్యాయానికి లేదా వేరే అధ్యాయానికి లేదా వేరే పుస్తకానికి చెందిన మరో వాక్యంతో సంబంధం ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాల్లో బైబిలు మొదటిది అని చెప్పడంలో సందేహం లేదు. అత్యధిక విమర్శకులు కలిగిన పుస్తకం కూడా బైబిలే. క్రైస్తవుల నమ్మకం ప్రకారం బైబిలు పదునైన రెండంచుల ఖడ్గం. బైబిలు చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందని, రక్షణగా ఉంటుందని, ఎక్కడికి వెళ్ళినా లేదా విజయం సిద్ధిస్తుందని క్రైస్తవులు నమ్ముతారు. బైబిలులోని పాత నిబంధన గ్రంధములోని వృత్తాంతాలు చరిత్ర సంఘటనలు కాకపోయినా సామాజిక పరిస్థితులు చూపిస్తాయి. ఏసు క్రీస్తు జీవితము చరిత్రయే అయినా క్రొత్త నిబంధన లిఖించబడినది ఏసు క్రీస్తు మరణించిన తర్వాత కాలంలోనే. హిందూ వేదాలవలే బైబిలు కూడా త్రైత సిద్ధాంతమునకు చెందినది.
మధ్య యుగంలో కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల ఇంగ్లండు చర్చివారు ప్రొటస్టెంట్లు, కేథలిక్కులు, తూర్పుసనాతన సంఘం, పెంతికోస్తు, బాప్టిస్టు వంటి ఎన్నో సంఘాలుగా చీలిపోయారు. ప్రొటస్టెంట్లు ఏసుక్రీస్తు బోధనలు, మహిమలు, శిలువయాగం, తిరిగి రావడం వంటివి నమ్ముతారు. కేథలిక్కులు బాల్యంలో యేసు చేసిన మహిమలు, తల్లి మేరీ చేసిన మహిమలు, శిలువయాగం, తిరిగి రావడం వంటివి నమ్ముతారు. నేడు ప్రపంచంలో సుమారు అన్ని భాషల్లోను బైబిలు అచ్చువేయబడుచున్నది.
కేథలిక్కు బైబిల్ అధనపు అధ్యాయాలుసవరించు
మొదటి ఎస్డ్రాసు, రెండవ ఎస్డ్రాసు, తోబితు, యూదితు, సిరాకు పుత్రుడైన యేసు జ్ఞానం, బారూకు, ముగ్గురు పరిశుద్ధ పిల్లల పాటలు, సూసన్న చరిత్ర, బేలు, డ్రాగనుల చరిత్ర, మనస్సేప్రార్థన, మొదటి మక్కబీయులు, రెండవ మక్కబీయులు
ప్రొటస్టెంట్ బైబిలులో ఇవి ఉండవు.
పాత నిబంధన అధ్యాయాలు
బైబిల్లోని మొదటి భాగాన్ని పాత నిబంధన గ్రంథం అని అంటారు.ఇందులో ఇశ్రాయేలీయుల యూదుల కథలు ఆజ్ఞలు సామెతలు కీర్తనలు, దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ[హీబ్రూ]లో రాశారు. ఇవి 39 పుస్తకాలు :
ఆది పంచకము [పంచ కాండములు} ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము,. చరిత్ర గ్రంథలు ( యెహూషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యోషయా, యిర్మియా, విలాపవాక్యములు, యెజెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ
కొత్త నిబంధన
రెండవ భాగాన్ని కొత్త నిబంధన గ్రంథం అంటారు. గ్రీకులో యేసుక్రీస్తు జీవితచరిత్రనే నాలుగు సువార్తలుగా నలుగురు రాశారు. అపోస్తలుడైన పౌలు వివిధ సంఘాలకు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.27 పుస్తకాలు ఇవి:
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు పత్రిక, I కొరంథీయులకు పత్రిక, కొరంథీయులకు పత్రిక, గలతీయులకు పత్రిక, ఎఫసీయులకు పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, కొలొస్సైయులకు పత్రిక, 1 థెస్సలొనీకైయులకు పత్రిక,2 థెస్సలొనీకైయులకు పత్రిక, I తెమోతికి పత్రిక, II తెమోతికి పత్రిక, తీతుకు పత్రిక, ఫిలేమోనుకు పత్రిక, హెబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, I పేతురు పత్రిక, II పేతురు పత్రిక, I యోహాను పత్రిక, II యోహాను పత్రిక, III యోహాను పత్రిక, యూదా పత్రిక, ప్రకటన గ్రంథము.
బైబిలుకు చెందని పుస్తకాలు
1945 డిసెంబరు న మహమ్మద్ ఆలీ సమ్మాన్ అను వ్యక్తి తన వ్యవసాయ భూమిని Fertilize చేసుకోవడానికి మెత్తటి మట్టి కొసం ఈజిప్టులోని నాగ్ హమ్మడి (Nag Hammadi) పట్టణం చేరువలో ఉన్న జబల్ అల్ తరిఫ్ (Jabal Al Tarif) అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో పాపిరస్ (Papyrus) అనే మొక్క తో తయారుచేయబడిన 13 పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. Coptic అనే ఈజిప్టు భాషలో వ్రాయబడిన ఇవి 350 A.D కి మరియు 400 A.D కి మధ్య వ్రాయబడినవని పరి శోధకుల ఊహ. ఈ పుస్తకాలు ప్రధానంగా ఇప్పుడున్న బైబిల్ గ్రంధానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏసు క్రీస్తు కు మహిమ శరీరమే గాని భౌతిక శరీరం లేదు కనుక శిలువ మరణం అబద్ధమని, ఏసు క్రీస్తుకు మగ్దలేని మేరి తో శారీరక సంబంధం ఉన్నదని , వివాహం చేసుకోకుండా కన్యలుగా, బ్రహ్మచారులుగా ఉండాలని చెబుతాయి. క్రీస్తును విశ్వసించడం వల్ల మోక్షం లభించదు కాని నిగూఢమైన అనుభవము ద్వారా గాని లేదా ప్రత్యేకమైన తదాత్మయం (revelation) చెందడం వల్ల గాని లభిస్తుంది అని చెబుతాయి. 1896 ఈజిప్టు రాజధాని కైరో నగరంలో కూడా ఇటువంటి పుస్తకాలు బయల్పడ్డాయి. ఇవన్నీ అసలైన క్రైస్తవ బోధనలకు విరుద్ధంగా ఉన్నవి. కనుక ఈ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల దృష్టిలో బైబిల్ వ్యతిరేక పత్రికలుగా మిగిలిపోయాయి.
ఇతర గ్రంథాలతో పోలికలు
హిందూ సాహిత్యం వలే బైబిలు కూడా త్రైత సిద్ధాంతానికి చెందినది.
బైబిలు ప్రకారం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిమూర్తులైతే, వేదాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు.
పాత నిబంధనలో ఉన్న జంతు బలి అర్పణలు హిందూ వేదాల్లో కూడా ఇవ్వబడినవి.
పాత నిబంధనలో ఆదాము ఆది మానవుడైతే హిందూ పురాణాల్లో మనువు ఆది మానవుడు.
హిందూ గ్రంథాల్లో పేర్కొన్న స్వర్గలోకాన్ని బైబిలులో పరలోకంగా పిలుస్తారు.
బైబిలు విగ్రహారాధన ఖండిస్తుంది, హిందు మతంలో విగ్రహారాధన సాధారణం.
బైబిల్ ప్రకారం పాపుల్ని పాపంనుండి రక్షించాలి, భగవద్గీత ప్రకారం పాపుల్ని సంహరించాలి.
పాత నిబంధన ప్రకారం నోవాహు అను దైవ భక్తుడి కాలంలో జరిగిన జల ప్రళయం మత్స్య పురాణంలోను, ఖురాన్ లోను, సుమేరియన్ల కావ్య గ్రంధమైన గిల్గమేష్ లోను మరియు ఎన్నో ఇతర పుస్తకాల్లోను ఇవ్వబడినది.
తెలుగులో బైబిలు

సామాన్య ప్రార్థనల పుస్తకము - 1880లో ముద్రిచబడినది.

1812లో బైబిలులో కొంత భాగము తెలుగులో ప్రచురితమైంది. 1818లో క్రొత్త నిబంధన గ్రంథము ప్రచురించారు. 1854లో పూర్తి బైబిలును తెలుగులో ప్రచురించారు. 1842లో S.P.G. తెలుగు మిషను కడప జిల్లాలో ఆరంభమైంది. రెవ.విలియమ్ హొవెల్ 1842లోనే ప్రార్థనల పుస్తకాన్ని, కొంత బైబిలును అనువదించాడు. 1858లో S.P.C.K. వారు మద్రాసులో దీనిని ప్రచురించారు. అంతకు ముందే 1849లో పి.ఆర్.హంట్ 'A Teloogoo translation of the Book of Common Prayer'ను మద్రాసు అమెరికన్ ప్రెస్సులో ప్రచురించాడు. 1880లో మద్రాసు డయోసియన్ కమిటీవారు S.P.C.K. ప్రెస్సులో సామాన్య ప్రార్థనల పుస్తకాన్ని ప్రచురించారు. కడప, ముత్యాలపాడులలో మిషనరీ కార్యములు నిర్వహించిన రెవ.జాన్ క్లే మంచి తెలుగు పండితుడు. ఆయన ఈ తెలుగు బైబిలును విస్తృతంగా సవరించాడు.

తెలుగు బైబిల్ ను ఆన్ లైన్

తెలుగు బైబిల్ ను ఆన్ లైన్ లో చదువుకోడానికి కింద ఉన్న ఫోటో పై క్లిక్ చేయండి.

 Online Telugu Bible

PAVURA SWARAM MINISTRIES

Wednesday, 24 August 2016

Telugu Christian Songs

PAVURA SWARAM MINISTRIES

Telugu Christian Albums

Andhra Christian Songs
Rev. Amshumathi Mary Songs
Bro. Anil Kumar Songs
Bro. A. R. Stevenson Songs
Bro. Akumarthi Daniel Songs
Bro. Babanna Songs
Dr. Balasubrahmanyam S. P. Songs
Dr. Bhanu Murthy Nainala Songs
Dr. Bilmoria Rapaka Songs
Children Songs Collection
Dr. Thomas(Dahinchu Agni) Songs
Bro. Deevanaiah Songs
Bro. Devaraju Jakki Songs
Bro. D.G.S. Dhinakaran Songs
Bishop Daniel Kalyanapu Songs
Dr. Ezra Sastry Songs
Sis. Hema John Songs
Sis. Jikki Songs
Dr. John Wesley Songs
Bro. Joshua Shaik Songs
Bro. Kamalakar Padeti Songs
Bro. Kripal Mohan Songs
Dr. Madhu Joe & Dr. Veena Jesse Payarda Songs
Sis. Mahitha Charles Pilli Songs
Bro. M. M. Keeravaani Songs
Sis. M. M Srilekha Songs
Rev. Dr. M. S. Santhavardhan Songs
Rev. Dr. P. J. Stephen Paul Songs
Bro. Raj Prakash Paul Songs
Rev. Raja Babu Songs
Dr. Satish Kumar Songs
Sis. Swarnalatha Jasonraj Songs
Bro. Vijay Benedict Songs
Visvavaani Radio Songs
Bro. Yesanna Songs
Bro. Yehoshua Kamalakar Songs
Zion Songs(సీయోను కీర్తనలు) Collection

విసుగక పట్టుదలతో చేయు ప్రార్ధన

"దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?" లూకా 18:7

DL మూడి అనే దైవజనుని కొంత మంది ప్రశ్నించారట మీ విజయ రహస్యమేమిటని?

దానికి ఆయన 7 కారణాలున్నాయి అని చెప్తూ... 1. ప్రార్ధన 2. ప్రార్ధన 3. ప్రార్ధన 4. ప్రార్ధన 5. ప్రార్ధన 6. ప్రార్ధన 7. ప్రార్ధన అని చెప్పారట. దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ప్రార్ధన యొక్క ప్రాధాన్యత ఎట్లాంటిదో? విసుగక పట్టుదలతో ప్రార్ధించిన ఆ ప్రార్ధనా వీరుడు అనేక ఆత్మలను రక్షించగలిగాడు.

లూకా సువార్త 18:1-7 వచనాలు చూస్తే యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం కనిపిస్తుంది.

ఒక న్యాయాధిపతి వున్నాడు. • అతడు అన్యాయస్తుడు • అతనికి దేవుడంటే భయంలేదు • మనుష్యులంటే లెక్కలేదు.

ఇట్లాంటి వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ నాకు న్యాయం తీర్చమని విసుగక,పట్టువిడువక, మాటి మాటికి వస్తున్న సందర్భములో, అప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడట.

అన్యాయస్తుడైనవాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా, న్యాయవంతుడైన దేవుడు, నీ కోసం తన చివరి రక్తపుబొట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్ధన ఆలకింపడా?

ప్రార్ధించే మనము దేని నిమిత్తం ప్రార్దిస్తున్నామో? దానిని పొందుకొనేవరకు ప్రార్ధించాలి.

మనము కొద్ది రోజులు ప్రార్ధించి విసిగిపొతాము. అయితే, ఒక విషయం అర్ధం కావాలి.

విసుగక పట్టుదలతో మనము దేని నిమిత్తం అయితే ప్రార్దిస్తున్నామో? దేవుడు దానిని మనకోసం సిద్ధపరచే సమయంలో, విసిగిపోయి ఇక మన ప్రార్ధనకు సమాధానంరాదు అనుకొని, ప్రార్ధించడం మానేస్తాము. అందుకే, అనేక ప్రార్ధనలకు ప్రతిఫలాలను పొందలేకపోతున్నాము.

విసిగిపోవద్దు. ఆయన ఆలస్యము చేస్తాడేమో గాని, అలక్ష్యము చెయ్యడు. ఆ ఆలస్యములో కూడా ఒక మేలు దాగివుంది అనే విషయం మరచిపోవద్దు. ఎప్పుడు నీకు ఏమి కావాలో? నీకంటే ముందుగా ఆయనకే తెలుసు అనే విషయం గుర్తుంచుకో.

సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది. అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. కాలేబుకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి 45 సంవత్సరాలు పట్టింది.

తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. అయితే, పొందుకొనేవరకు విసుగక పట్టుదలతో ప్రార్ధించాలి.

ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు!

అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక..!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Narayanakhed Meeting








నీటి ఊటలను ఆశించిన స్త్రీ - అక్సా

నీటి ఊటలను ఆశించిన స్త్రీ - అక్సా
(యెహోషువ 15:13-19)

అరుదుగా వినిపించే ఈ స్త్రీ పేరు అక్సా. ఈ పేరునకు “కడియం” అని అర్థం ఈమె యెపున్నె కుమారుడైన కాలేబు పుత్రిక, కాలేబు అనాకీయుల దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత దేబీరు నివాసుల మీదికి తన దృష్టిని సారించాడు. దానిని కొల్లగొట్టినవారికి తన కుమార్తెయైన అక్సాను యిచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించాడు. కాలేబు సహోదరుని కుమారుడైన ఒత్నీయేలు ఈ ప్రయత్నంలో నెగ్గినందున అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిగించాడు దక్షిణ భూమిని పెండ్లి కానుకగా ఇచ్చాడు.

వివాహానంతరం అక్సా తన భర్తతో సంప్రదించి, తండ్రి యొద్దకు వచ్చి నీటి మడుగులను అడుగగా అతడు పల్లపు మడుగులను మెరకమడుగులను యిచ్చినట్లు వాక్యభాగములో మనము చూడగలము (యోహాను 15:18-19) అక్సా గాడిద దిగగానే తండ్రి నుండి దీవెనలు కోరుకుంది (యోహాను 15:18) తండ్రి యొక్క దీవెన తనను వర్ధిలజేస్తుందని ఆమె విశ్వసించింది. “నీవు దీర్ఘయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము” అనే దేవుని ఆజ్ఞను ఆమె అమలుపరిచింది తండ్రి కూడా ఆమె విధేయతకు ముగ్ధుడై ఆమె కోరిన విధముగా మడుగులను దయచేశాడు. ఆమె బాలికగాను కన్యగాను ఉన్ననాటినుండి తన తండ్రి యొక్క గుణగణాలను అంచనా వేసుకుంది. తన తండ్రి అడిగినవి యిస్తాడని నమ్మింది. మడుగులను కోరి రెండింతలుగా ఫలితాన్ని సాధించింది. “అడుగుడి మీకియ్యబడును” అని సెలవిచ్చిన మన పరమ తండ్రిని అడిగి మనము ఈవులను సంపాదించుకోగలుగూతున్నామా అని మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

బైబిల్ గ్రంథములో అక్సా పేరు పై అద్యాయములోను, (న్యాయాధిపతులు 1:12-15;1 దినవృత్తాంతములు 2:49) లో మాత్రము నేను చూడగలిగినాను. ఇంత తక్కువ ప్రాచుర్యముగల ఈ స్త్రీ కొరకు ఒత్నీయేలు తన ప్రాణాలకు సైతం తెగించి పోరాడాడంటే ఆమెలో అతనికి నచ్చిన ప్రత్యేకత ఏదో ఉండి ఉంటుంది. అక్సా శరీర సౌందర్యము కలిగి ఉండవచ్చును. కాని అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని బైబిల్ సెలవిస్తుంది. యెహోవావయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని సామెతల గ్రంథకర్త వ్రాసినట్టుగా ఈమె దైవభక్తి అతనికి నచ్చియుండవచ్చు. యెహోవాయందు భయమే జ్ఞానమునకు మూలము గనుక ఈమె జ్ఞానవంతురాలై తన గృహనిర్వహణ జరిగియుండవచ్చు. ఆనాటి స్త్రీలకు నేటి స్త్రీలవలే ప్రాథాన్యత ఇవ్వబడలేదు ఈ రోజుల్లాగ రిజేర్వేషనులు వగైరా అసలేలేవు.

కుటుంబ చరిత్రలో కూడా స్త్రీ ప్రస్తావన చాలా స్వల్పముగా కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులకు ప్రధానుడైన యాకోబుకు పన్నెండు మంది కొడుకులు కాగా ఒక్కతే కుమార్తె కలదు. అట్టి సమాజంలో జీవించిన అక్సా దైవభక్తి గలవారము అని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సంపూర్ణ విధేయతతో సత్ క్రియలు చేయుచూ, సంఘకార్యకలాపములలో చాటుగావుండి భర్తను ప్రోత్సహించుచూ, బిడ్డలను దైవభక్తిలో పెంచియుండవచ్చునని నమ్మాలి.(ద్వితియోపదేశకాండము 11:18-19) వచనములలో తల్లులు తమ పిల్లలకు నేర్పవలసిన సంగతులను గూర్చి వ్రాయబడివుంది. ప్రియనేస్తం మనము మన పిల్లలకు ఏమీ నేర్పుతున్నాము సమాజంలో ఘనత, విద్య, ర్యాంకులు, ఉద్యోగము వీటిచే మన పిల్లలను ప్రోత్సహించుటగాక ఆయన రాజ్యము నీతిని మొదట వెదికేలా చేయాలి. నీ బాలురను శిక్షించుట మానకుము నీ కుమారుని శిక్షింఛిన యెడల అతడు నిన్ను సంతోషపరచును. (సామెతలు 19:18) పిల్లలను శిక్షించి పెంచాలని బైబిల్ తేట తెల్లముగా వెల్లడించుచున్నది. మన ప్రియ పిల్లల యెడల మన కర్తవ్యమెలా వుందో అలోచించుకుందాం.

చివరిగా ఆలోచిస్తే ఊటలు లేనిదే పొలము ఫలించదనే సత్యాన్ని అక్సా గ్రహించింది. అందుకే కీర్తనాకారుడు మా ఊటలు నీయందె ఉన్నవని కీర్తనలు 87:7 లో వ్రాశాడు. జీవపు ఊటలలో అక్సా తన జీవితవేరులను, కుటుంబవేరులను పెంపుజేసుకున్నది, మేలు అనుభవించింది. బైబిల్ గ్రంథమును పరిశీలించినట్లయితే జీవపు ఊటలకై తపించిన స్త్రీలు మరికొందరు కనిపిస్తారు. శారా దాసియైన హాగరు బెయెర్షబా అడవులలో ఎలుగెత్తి యేడ్చుట ద్వారా నీటి ఊటలను సంపాదించుకొనగలిగినది. దప్పిగొనిన వారలారా నీళ్ళయొద్దకు రండి అని ప్రభువు పిలుచుచున్నాడు. ఆయన యిచ్చే ఊటలు సాక్షాత్తు ప్రభువు సిలువపై కార్చిన రక్తధారలేనని ప్రతివారు గ్రహించాలి. అవి జీవింపేజేసే జీవపు ఊటలని గ్రహించలేక అపవిత్రమైన ఊటలను తృణీకరించి లోకసంబంధమైన తొట్టెలను మన కొరకు ఏర్పాటు చేసుకొనుచున్నాము.

ఈ విషయమై బైబిల్ ఇలా సెలవిస్తుంది “నా జనులు రెండు నేరములు చేయుచున్నారు. మొదటిగా జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు రెండవదిగా వారి కొరకు బ్రద్ధలై నీళ్ళు నిలవని తొట్టెను తొలిపించుకొనియున్నారు” అని మన ప్రభువు ఎంతో ఆవేదన చెందుతున్నాడు.

(యిర్మియా 2:13) క్యాలండర్లో నూతన సంవత్సర సంఖ్యను సంఖ్యను చూచి పొంగిపోతున్న మనము అక్సావలే మన కుటుంబములను, నీటి ఊటల వద్దకు నడిపించాలి. రాబోవు తరములను నీటిబాటలో నడిపించవలసిన గొప్ప బాధ్యతను దేవుడు స్త్రీల మీద ఉంచాడు. గనుక ప్రార్థించే తల్లులముగానూ అయన రాకడకొరకు నమ్మకమైన సాక్షులముగాను ఉండాలని ప్రభువు కోరుచున్నాడు.

పదిమంది కుష్టురోగుల ప్రార్ధన

యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. లూకా 17:13

కుష్టు పాపమునకు సాదృశ్యము • కుష్టు సోకిన వారు, పాలెం వెలుపల జీవించాలి. వారినెవరూ తాక కూడదు. • ఒకవేళ వారు బాగుపడితే, యాజకులకు తమ దేహాలను కనుపరచుకొని, మోషే నిర్ణయించిన కానుక సమర్పించి, ఆ తరువాత సమాజములో చేరాలి. • మిర్యాము, గెహాజి వంటి వారు కుష్టుతో మొత్తబడ్డారు.
యేసు ప్రభువు వారు యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్తున్నారు. •ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసూ ప్రభువా! మామీద జాలిచూపు అంటూ కేకలు వేస్తున్నారు.
దూరముగా ఎందుకు నిలవాలి? దగ్గరకు రావచ్చుకదా? లేదు. లెవీ కాండము 13: 45,46 ప్రకారము, వారు దగ్గరకు రావడానికి వీల్లేదు. అందుకే దూరముగా నిలిచారు.

*అయితే, యేసు ప్రభువును సహాయము అడిగినప్పుడు ఆయన కాదనిన సందర్భాలుగాని, ఆయన చెంతకు వచ్చినవారిని త్రోసివేసిన సందర్భాలుగాని లేనేలేవు*.

ఆయన వారిని చూచి, మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లు చుండగా, శుద్ధులైరి. లూకా 17:14

అయితే, వారు అడిగిన దానికి సమాధానముగా ఆయన వారిని ముట్టలేదు. స్వస్థ పరచలేదు. యాజకుల దగ్గరకు వెళ్లి, మీ దేహాలను వారికి చూపించుకోండి అని చెప్పారు.

అయితే, వారు ప్రశ్నించాలి కదా? ఇట్లాంటి దేహాలతో యాజకుల దగ్గరకు ఎట్లా వెళ్ళగలమని? వారికి ఎట్లాంటి సందేహం రాలేదు. పూర్తిగా ప్రభువువారి మాటలను విశ్వసించారు. ఏమి మాట్లాడకుండా యాజకుల దగ్గరకు బయలుదేరారు. అంటే? వారికున్న విశ్వాసం స్పష్టం అవుతుంది. వారు ఇంకా యాజకుల దగ్గరకు చేరకముందే, మధ్యలోనే స్వస్థ పరచబడ్డారు.

అందుకే, ప్రభువువారు కూడా, తిరిగి వచ్చిన ఆ సమరయునితో "నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరచింది" అంటున్నారు. మన జీవితాలలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోలేక పోవడానికి కారణం? విశ్వసించలేకపోవడం, తద్వారా ఆయన చెప్పినట్లు చెయ్యలేకపోవడమే.

*పదిమందీ కరుణించమని ప్రార్ధించారు, పదిమందీ విశ్వసించారు. పదిమందీ బయలుదేరి వెళ్ళారు. పదిమందీ స్వస్థపరచ బడ్డారు. కాని, కృతజ్ఞత కలిగి, తిరిగివచ్చి, ఆయనను ఆరాధించిన వాడు ఒక్కడే*.

ఆ తొమ్మిదిమంది ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం కదా? అవును! అయితే, మన సంగతేమిటి? పాపపు కుష్టుచేత నిత్య మరణమునకు తప్ప, దేనికీ యోగ్యతలేని మనలను ఆయన ప్రాణమునే బలిగా అర్పించి, ఆ నిత్య మరణము నుండి తప్పించినందులకు మనమెట్లాంటి కృతజ్ఞత కలిగియున్నాము?

*దేవుని మేలులు అనుభవిస్తూ, కృతజ్ఞతలేని ఆ తొమ్మిదిమందివలే మన జీవితాలున్నాయేమో*? సరిచూచుకుందాం! సరిచేసుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక! *ఆమెన్! ఆమెన్! ఆమెన్*!

విగ్రహారాధన

యేసు ప్రభువు వారు మనకు బదులుగా భారమైన సిలువను మోసారు. అవి కరుకైన నిలువు, అడ్డు దుంగలు మాత్రమే. ఇక ఆ సిలువ రూపమును(విగ్రహమును) మనము మెడలో వేసుకొని మోయాల్సిన అవసరం లేదు.

'దేనిరూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. నిర్గమ 20:4

ఆయన సిలువను మోస్తే? ఆ సిలువకు ఘనత వచ్చింది. మనము మోస్తూ ఆ సిలువకు అవమానం తెచ్చిపెడుతున్నాం.

ఒక్క విషయం ఆలోచించు!! సిలువను ధరించిన నీవు మాట్లాడేటప్పుడుగాని, దేవునికి వ్యతిరేఖమైన క్రియలు జరిగించేటప్పుడు గాని, అయ్యో! నేను సిలువను ధరించానే. ఇట్లా మాట్లాడకూడదు. ఇట్లాంటి పనులు చెయ్య కూడదు అనే తలంపు ఎప్పుడైనా వచ్చిందా? లేదు.

ఏదో భక్తి చేస్తున్నాం అనుకొంటున్నాము గాని, ఆ భక్తి దేవునికి అవమానం తెచ్చి పెట్టేదిగా వుంది?

చేతి మీద సిలువ రూపాన్ని పచ్చాబొట్టు వేయించుకొని అదే చేతితో సిగరెట్టు, మందు గ్లాసు పట్టుకుంటే? ఆ సిలువకు గౌరవమా? అవమానమా?

సిలువను ధరించి, సిలువకు అవమానం తెచ్చేకంటే? ధరించక పోవడమే శ్రేయష్కరం కదా? ఆలోచించు!!

యేసయ్య సిలువ త్యాగాన్ని అర్ధం చేసుకో! అనుసరించు! అది చాలు.

సిలువ ఒక విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారిపోతావు.

విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8

వద్దు! ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం. సాగిపోదాం. గమ్యం చేరేవరకు.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

:::నేడు రక్షకుడు నా కొరకు పుట్టియున్నాడు(లూక 2:11):::

యేసు క్రీస్తు ఈ రక్షణను మనకు ఎందుకు కలుగ చేసెను?

లూక 1:75 మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.

నా రక్షకుడు నాకు రక్షణ శృంగము గాను, రక్షణాధారము గాను, రక్షణకర్త గాను,రక్షణాశ్రయదుర్గముగాను ఉన్నారు.

a) రక్షణ శృంగము(Horn of my salvation):

కీర్తన 18:2 యెహోవా నా రక్షణ శృంగము.

ఈ రక్షకుడు మనకు రక్షణ శృంగము ఉండి మన శత్రువులనుండియు మనలను ద్వేషించువారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేయును (లూక 1:68)

b) రక్షణాధారము (God is my Salvation)

కీర్తన 62:6 ఆయనే నా రక్షణాధారము నేను కదలింపబడను.

ఈ రక్షకుడు ఆపత్కాలమున మనకు రక్షణాధారముగా ఉండును( యెషయ 33:2)

c) రక్షణకర్త (God of our salvation)

ఈ రక్షకుడు మనకు రక్షణ కర్తగా ఉండి మన పాపములను పరిహరించును

కీర్తన 79:9 మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.

d) రక్షణాశ్రయదుర్గము (Rock of my salvation)

ఈ రక్షకుడు మనకు రక్షణాశ్రయదుర్గముగా ఉండి మన నిమిత్తము ప్రతిదండన చేయును

2 సమూ 22:47,48 యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక

1. నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు

2. నా నిమిత్తము పగ తీర్చు దేవుడు

3. జనములను నాకు లోపరచువాడు ఆయనే

రక్షణ సమాచారము(Proclaims salvation)

మనకు రక్షణ శృంగము గాను , రక్షణాధారము గాను, రక్షణకర్త గాను,రక్షణాశ్రయదుర్గముగాను ఉన్న రక్షకుని గూర్చిన సమాచారము అనేకులకు ప్రచురింప బద్దులమై ఉన్నాము

యెషయ 52:7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడుఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.

రక్షణ పాత్ర(cup of salvation):

కీర్తన 116:12,13 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?

రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.

రక్షణ: ఇంత గొప్ప రక్షణ పొందుటెట్లు?

1. హృదయమందు విశ్వసించినయెడల రక్షింపబడుదువు

రోమ 10:9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు

2. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము.

రోమ 10:10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.

3. ప్రభువు నామముబట్టి ప్రార్ధనచేయు వాడు రక్షింపబడును రోమ 10:13 ఎందుకనగా ప్రభువు నామముబట్టి ప్రార్ధనచేయువాడెవడో వాడు రక్షింపబడును.

మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును కలుగజేసిన ఈ రక్షణను బట్టి మనము నిత్యము స్తుతించవలసిన వారమైయున్నాము.

Tuesday, 23 August 2016

★నేడు క్రైస్తవ సంఘములో ఉన్న మూఢాచారాలు★

- మొదటి నుండి ప్రార్థనలో లేకపోయినా పర్వాలేదుగాని ముగింపు ప్ర్రార్థనలో ఆశీర్వాదం ఇచ్చే సమయానికి వచ్చి కళ్ళు మూసుకుని ఆమెన్ అంటే చాలు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. (దేవునికి తెలియదా ఎవరికి ఆశీర్వాదాలు ఇవ్వాలి అని?)

- Church నుండి నేరుగా మీ ఇంటికే వెళ్ళాలి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. (ఆచరించేదే తప్పు దానిలో కూడా స్వార్ధం)

- Church నుండి ఇంటికి వెళ్ళాక కాళ్ళు కడుక్కుని ఇంటిలోనికి వెళ్తే ఆశీర్వాదలు పోతాయి. (అశీర్వాదలేమన్న గాలా, ధూలా కాళ్ళు కడుక్కుంటే పోవటానికి)
పోయినసారి ప్రభువు బల్లలో పాలుపంచుకోలేదు అందుకే ఈ నెల అంతా నాకు ఆరోగ్యం బగాలేదు. (రొట్టె ద్రాక్షారసం అంటే paracetemol tablet అనుకున్నావా! ప్రభువు రక్తశరీరాలు, జాగ్రత్త!)

- ఎలా సంపాదించినా పర్వాలేదు నెలకు పదియవ భాగం తీసి ఇచ్చేస్తే ఇంట్లో డబ్బులు నిలబడతాయి. (నువ్వు ఇచ్చేది పదియవ భాగమా లేక నీ అక్రమ సంపాదనలో 10% partnership share ఆ?)

- నేను వ్యక్తిగత ప్రార్థన చేసుకోనక్కరలేదు pastor గార్కి గాని prayer towers కి గాని వాళ్ళు ఇచ్చే prayer packages ప్రకారం డబ్బులు చెల్లిస్తే చాలు నా గురించి వాళ్ళే ప్రార్థన చేస్తారు. నేను మాత్రం హాయిగా నాకేమి పట్టనట్టు నిద్రపోతాను. (నీకు ఆకలి వేస్తె వాళ్ళకి అన్నం పెడుతున్నావా? దేవుడు నువ్వు మాట్లాడతావేమో, నీ మాట్లాడితే విందామని చూస్తున్నాడు)

- ఏలా జీవించినా పర్వాలేదు ఎదొకటి మొక్కుకుని కృతజ్ణతగా ఎంతో కొంత దేవుడికి ఇచ్చేస్తే మనం ఏం చేసినా క్షమించేస్తాడు. (నువ్వు ఇచ్చేది లంచమా, కృతజ్ణతా?)

- మిగిలిన రోజుల్లో ఎలా జీవించినా పర్వాలేదు 40 దినాలు మాత్రం non-veg తినకుండా మధ్యం తాగకుండా శ్రమదినాలు పాటిస్తే చాలు. (నీకోసం ఆయన already శ్రమ అనుభవించాడు. ఇప్పడు నీకు కావాల్సింది నీ పాపాలకై పశ్చాత్తాపం, award కోసం acting కాదు. ఆయనను శిలువ వేసినట్టే నువ్వు కూడా వేయించుకుంటావా?)

నా ప్రియ సహోదరా! నువ్వు ఆచరించే లోకాచారాలు తీసుకొచ్చి క్రైస్తవ్యం మీద రుద్దకు. దేవుడు అంటే ప్రేమాస్వరూపి మాత్రమే కాదు, ఉగ్రపాత్రను చేతబట్టుకున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకో. ఇలాంటివి ఆచరించి దేవుని ఉగ్రతకు గురి కాకు. ఒక్కసారి దేవుడు నీకు ఇచ్చిన ఇంకిత జ్ఞానాన్ని ఉపయోగించు. అనుదినం వాక్యాన్ని చదువుకుంటూ దేవుని చిత్తనుసారంగా జీవించు. ఇలాంటివి నువ్వు ఆచరిస్తున్నట్లైతే సరిచేసుకోవటానికి ప్రయత్నించు.

★నా కృప నీకు చాలును★

నా కృప నీకు చాలును. 2 కొరింది 12:9

కృప అంటే? "అర్హత లేనివాడు అర్హునిగా ఎంచ బడడమే కృప."

దొంగ దోచుకోవడానికి వచ్చి దొరికిపోయాడు. అతనిని ఏమి అనకుండా క్షమించి విడచి పెట్టేస్తే అది జాలి, దయ అని చెప్పొచ్చు. అట్లా కాకుండా అతనికి భోజనం పెట్టి, బస్ చార్జీలు ఇచ్చి పంపిస్తే? అది కృప.

ప్రభువా అని పిలువడానికి కూడా అర్హతలేని మనకు తండ్రీ అని పిలిచే యోగ్యత నిచ్చింది ఆయన కృప.

వ్యక్తిగత, కుటుంబ, మానసిక, ఆర్ధిక, సామాజిక సమస్యలతో అల్లాడిపోతున్న పరిస్థితులా?

ఏ రేవుకెళ్ళినా ముండ్ల పరిగే అన్నట్లుగా సాగిపోతుందా జీవితం?

భయపడవద్దు. దిగులు చెందవద్దు. నీ ప్రియ రక్షకుడు నీకిస్తున్న వాగ్దానం 'నా కృప నీకు చాలు'

అవును! అవి ఎట్లాంటి పరిస్థితులైనాసరే. చివరకు అది అగ్నిగుండమైనా సరే. ఆయన కృప నీకు తోడుగా వుండబోతుంది. ఆయన కృప నీకు తోడుగా వుంటే? అగ్నిగుండం సహితం నిన్నేమి చేయగలదు?

పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు యెషయా 54:10

అట్టి కృపను నిర్లక్ష్యం చెయ్యొద్దు. చులకన చెయ్యొద్దు. శోధనలగుండా సాగిపోతున్న నీవు ఈ ఒక్క మాట హృదయ పూర్వకంగా చెప్పగలిగితే? చెప్పలేనంత సమాధానాన్ని పొందుకోగలవు.

ఒక్కసారి ప్రయత్నించి చూడు! ప్రభువా! నీ కృప నాకు చాలును. ఆమెన్! ఆమెన్! ఆమెన్

::తెలుగు ఆడియో బైబిల్ డౌన్లోడ్::

Download Telugu Audio Bible for free
You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

మన తండ్రి హస్తం...

ఒకానొక రోజు ఒక మారు మూల కొండ ప్రాంతంలో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ వున్నారు. అక్కడే వున్న లోయలో, వారికి ఎంతో ఉపయోగపడే కొన్ని అమూల్యమైన మూలికలున్నట్లు కనుగొన్నారు. కాని, అది చాల పెద్ద లోయ. అందువల్ల దానిలోనికి మనషులు దిగడం చాలా కష్టం. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న వారికి కొంత దూరంలో ఒక చిన్నవాడు గొర్రెలు మేపుకుంటూ కనిపించాడు. వారిలో ఒకరికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే అది వారందరికీ చెప్పాడు. అది విన్నవారంతా బాగా ఆలోచించి ఆ చిన్నవాడిని పిలిచి, తమకొక చిన్న పని చేసిపెట్టాలని, దానికి బదులుగా చాలా డబ్బు ఇస్తామని చెప్పారు. ఏం చేయాలో చెప్పమని వాడు అడుగగా, వారు ఆ లోయలోకి దిగాలి అన్నారు. సరేనన్న చిన్నవాడు, ఎలా దిగాలి ? అని ప్రశ్నించాడు. వాని నడుమునకు తాడు ఒకటి కట్టి లోయలోనికి దించుతామని, దిగి ఆ మూలికల్ని కోసిన తరువాత పైకి తాడు సాయంతో లాగేస్తామని చెప్పారు. వాడు బాగా ఆలోచించి, తనకు కొంచెం సమయం ఇస్తే ఇంటికి వెళ్లి వెంటనే తిరిగి వచ్చేస్తానని చెప్పి ఇంటికి పరుగెత్తాడు.

వెళ్లి చాలాసేపయినా రాకపోయే సరికి, ఇక రాడేమో అని వారంతా నిరుత్సాహపడుతున్నంతలో, దూరంగా తనతో పాటూ నడవలేక నడుస్తున్న పండు ముసలివాడ్ని వెంట నడిపించుకుంటూ తీసుకొస్తూ కనిపించాడు. అది చూచిన వారంతా, ఆ వచ్చే ముసలివాని చేత ఆ పని చేయించేందుకే వెంట తీసుకోస్తున్నాడు అని కంగారుపడ్డారు. వాడు వచ్చి, తన వెంట వచ్చింది తన కన్నతండ్రి అని, ఆయన్ని తీసుకొచ్చేందుకే ఇంటికెళ్లానని చెప్పి, ఇక తాడు కట్టి లోయలోనికి దించమని సిద్ధమయ్యాడు.

అయితే నడుముకు తాడు కట్టిన తరువాత వాడు, ఆ తాడు కొనని తన తండ్రి చేతికిమ్మన్నాడు. ఒక్కసారిగా అందరూ నిర్ఘాంతపోయారు. వారికి అర్ధంకాక నవ్వుకుని వాడితో, ఇక్కడ బలంగా వున్న ఇంతమందినీ కాదని ఏ మాత్రం శక్తిలేని ఈ పండు ముసలివానికిమ్మని అడుగుతున్నావెందుకు ? అని ప్రశ్నించారు. దానికి వాడు బదులివ్వక, తాడు తన అయ్య చేతికిస్తేనే దిగుతానని, లేకుంటే దిగనని గట్టిగా చెప్పాడు. ఏ మాత్రం శక్తిలేని మీ అయ్యకి ఆ తాడిస్తే నిన్ను పైకి లాగలేక ఆ లోయలోకే వదిలేస్తాడని వారు ఎంత చెప్పినా వాడు వినలేదు సరిగదా, తాడు వాళ్ళ అయ్య చేతిలో పెట్టకపోతే లోయలోకి దిగేదే లేదని తెగేసి చెప్పేసాడు.

దానితో వారికి ఎటూ తోచక, వాడ్ని దించాలా వద్దా ? అని ఆలోచిస్తుండగా, వాడు సార్.. మీరేమీ ఆలోచించకండి. నా తండ్రి చేతికి ఆ కొననివ్వండి. నేనెందుకు ఇంత గట్టిగా మొరాయిస్తున్నానంటే, ఒకవేళ మీలో ఎవరైనా ఆ తాడు పట్టుకుంటే, లాగేందుకు శక్తి సరిపోకపోయినా, లేక ఏదైనా మృగం వచ్చినా నన్ను ఈ లోయలోనే వదిలేసి వెళ్లిపోవచ్చు. కానీ అదే ఆ తాడు నా తండ్రి చేతిలో వుంటే మాత్రం తన బలాన్నంతటినీ ఉపయోగించి నన్ను పైకి ఎలాగోలా లాగేస్తాడు. తనకు చేతకాక మరీ కష్టమైతే, ప్రాణాన్నైనా నా కోసం పణంగా పెట్టేస్తాడేమో కానీ నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోయలోకి మాత్రం జారవిడువడు అని అన్నాడు. వాడి మాటలకు నివ్వెరబోయిన వారంతా వాడు చెప్పినట్టే ఆ తాడుని తన తండ్రి చేతికే ఇచ్చి మెల్లగా ఆ లోయలోకి దించారు. వాడు దిగి, వారు అడిగినట్టే వారికి కావలసిన ఆ విలువైన మూలికల్నికోసిన తరవాత వాని తండ్రి వాడ్ని లోయలోంచి పైకి లాగేసాడు.

దేవుని పైనే ఆధారం...

మనం ఒకటి గ్రహించాలి, మనవద్ద ఉన్నవి మనం పొందేవి అన్ని కేవలం ఒకే చోటునుండి పొందుతున్నాము. అది కేవలం మన దేవుని నుండియే. మన జీవితంలో ప్రతీ విషయంలో ఆయన మీద ఆధారపడాలి మరియు దేవుడే పునాదిగా ఉండాలి ఆ పునాదే లేనట్లయితే మనం పడిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బలమైన పునాదివేసి ఇల్లు కడతామో అప్పుడే ఆ ఇల్లు దృఢంగా మరియు ఎటువంటి పర్యావర ఉపద్రవాలు వచ్చినా నిలబడుతుంది. అదే విధంగా మన నిజ జీవితంలో కూడా దేవుడు అనే ధృడమైన పునాది వేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పడిపోకుండా ఉంటాము. ఈ విధమైన జీవితాన్ని కట్టుకోవాలి అంటే దేవునితో సత్ సంబంధం కలిగి వుండాలి. దేవుడే మన జీవితంలో మూలరాయి అయి ఉండాలి, ప్రతీ విషయంలో ఆయనమీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడడం తగ్గిపోతుందో ఏ కట్టడమైనా బలహీనంగా ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా ఆధారపడి జీవిస్తామో వారి ప్రయాస వ్యర్ధం కానేరదు. దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది “మనం ఆయన మీద అధారపడినట్లయితే ఆయన మన హృదయ వాంఛలన్ని తీరుస్తాడు”.

మనం ఆధారపడతాము కాని, ఎప్పుడు ఓపికతో కనిపెట్టుకొని ఉండము. ఓపికతో కనిపెట్టుకొనక మన ఇష్టపూర్వకంగా మన స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటాము. ఎందుకంటే నాకే అన్ని తెలుసు నా అంత గొప్పవాడు ఎవ్వరూ లేరు, జీవితం నాకు చాలా నేర్పింది, నాకున్న జ్ఞానంతో నేను ఏదైనా సాధించగలను అనే కొద్దిపాటి గర్వం అనే లక్షణం తో ముందుకు దూసుకు పోతుంటాము. మనకు ఉండే జ్ఞానంతో దేనినైనా మొదలుపెట్టగలము కాని దానిలో విజయాన్ని మాత్రం పొందలేము. గర్వం అనేది ఒక క్యాన్సర్ వ్యాధి లాంటిది, అది పూర్తిగా నాశనంచేసి తుదకు నిత్య మరణానికి దారితీస్తుంది. నీవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండవచ్చు, నీకు ఎటువంటి సమస్య అయినా ఉండవచ్చు అయితే అన్నింటికీ సమాధానం దేవుడే. ఆయనే ప్రతీ సమస్యలను సరిచేయువాడు, విరిగిన వాటిని మరలా చక్కగా అమర్చువాడు. ఎప్పుడైతే ఆయన మీద ప్రతీ విషయంలో ఆధారపడి ఆయన ఆజ్ఞలను పాటిస్తామో అపుడే ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు. అంతేకాకుండా నిజమైన సంతోషం, సమాధానం, కనికరం తో చక్కటి పరలోక జ్ఞానాన్ని మనలో నింపుతాడు. మన జీవితం చాలా చిన్నది అయితే దేవుడు ఒక్కడే. ఆయనే మన జీవితానికి పునాది అయితే ఆయనద్వారా సమస్తమూ సాధ్యమే.

కీర్తనలు 127:1 యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే.

పరిశుద్ధ గ్రంథ వివరములు - Telugu Bible Statistics

పరిశుద్ధ గ్రంథ వివరములు - Telugu Bible Statistics

Author: Pavura Swaram Ministries
Category: Bible Facts
Reference: General

       గ్రంథం                        అధ్యాయాలు                         వచనములు
1 ఆదికాండము                 Genesis 50                           1533
2 నిర్గామకాండము             Exodus 40                            1213
3 లేవీయకాండము            Leviticus 27                            859
4 సంఖ్యాకాండము            Numbers 36                           1288
5 ద్వితియోపదేశకాండము  Deuteronomy34                       959
6 యెహోషువ                    Joshua 24                                658
7 న్యాయాధిపతులు Judges 21                               618
8 రూతు                           Ruth 4                                     85
9 1 సమూయేలు 1           Samuel 31                              810
10 2 సమూయేలు 2         Samuel 24                               695
11 1 రాజులు                    1 Kings 22                               816
12 2 రాజులు                     2 Kings 25                              719
13 1 దినవృత్తాంతములు    1 Chronicles 29                       942
14 2 దినవృత్తాంతములు   2 Chronicles 36                        822
15 ఎజ్రా                             Ezra 10                                   280
16 నెహెమ్యా                     Nehemiah 13                          406
17 ఎస్తేరు                           Esther 10                               167
18 యోబు                        Job 42                                     1070
19 కీర్తనలు                        Psalms 150                             2461
20 సామెతలు                    Proverbs 31                             915
21 ప్రసంగి                         Ecclesiastes 12                        222
22 పరమగీతము               Song of Solomon 8                  117
23 యెషయా                     Isaiah 66                              1292
24 యిర్మియా                    Jeremiah 52                          1364
25 విలాపవాక్యములు       Lamentations 5                      154
26 యెహేజ్కేలు                 Ezekiel 48                             1273
27 దానియేలు                   Daniel 12                               357
28 హోషేయా                    Hosea 14                               197
29 యోవేలు                    Joel 3                                       73
30 ఆమోసు                     Amos 9                                 146
31 ఓబద్యా                       Obadiah 1                                 21
32 యోనా                        Jonah 4                                   48
33 మీకా                           Micah 7                                105
34 నహూము                    Nahum 3                                 47
35 హబక్కూకు                   Habakkuk 3                          56
36 జెఫన్యా                         Zephaniah 3                            53
37 హగ్గయి                         Haggai 2                              38
38 జెకర్యా Zechariah             14                                                  211
39 మలాకీ Malachi                4                                        55
40 మత్తయి Matthew           28                                     1071
41 మార్కు Mark                 16                                      678
42 లూకా Luke                     24                                     1151
43 యోహాను John                21                                      879
44 అపో. కార్యములు Acts      28                                    1007
45 రోమీయులకు Romans     16                                       433
46 1 కోరింథీయులకు 1 Corinthians 16                             437
47 2 కోరింథీయులకు 2 Corinthians 13                            257
48 గలతియులకు Galatians 6                                          149
49 ఎఫెసీయులకు Ephesians 6                                        155
50 ఫిలిప్పీయులకు Philippians 4                                      104
51 కొలస్సీయులకు Colossians 4                                        95
52 1 థెస్సలొనికయులకు 1 Thessalonians 5                       89
53 2 థెస్సలొనికయులకు 2 Thessalonians 3                       47
54 1 తిమోతికి 1 Timothy 6                                              113
55 2 తిమోతికి 2 Timothy 4                                               83
56 తీతుకు Titus 3                                                            46
57 ఫిలేమోనుకు Philemon 1                                               25
58 హెబ్రీయులకు Hebrews 13                                          303
59 యాకోబు James 5                                                       108
60 1 పేతురు 1 Peter 5                                                     105
61 2 పేతురు 2 Peter 3                                                       61
62 1 యోహాను 1 John 5                                                  105
63 2 యోహాను 2 John 1                                                   13
64 3 యోహాను 3 John 1                                                  14
65 యూదా Jude 1                                                            25
66 ప్రకటన గ్రంథం Revelation 22                                       404